జ్యోతిక జాక్ పాట్

పెళ్లయిన తరువాత నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది ఒకప్పటి హీరోయిన్ జ్యోతిక. ఆ సినిమాలను కూడా ఆమె భర్త సూర్యనే ఎక్కువగా నిర్మిస్తూ, ఆమెను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. అలా…

పెళ్లయిన తరువాత నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది ఒకప్పటి హీరోయిన్ జ్యోతిక. ఆ సినిమాలను కూడా ఆమె భర్త సూర్యనే ఎక్కువగా నిర్మిస్తూ, ఆమెను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. అలా మరో సినిమా ఇప్పుడు వస్తోంది. అదే జాక్ పాట్ పేరిట తెలుగులో విడుదల కాబోతోంది.

ఒకప్పటి మరో హీరోయిన్ రేవతి కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా ట్రయిలర్ ను, అడియోను ఈ రోజు చెన్నయ్ లో విడుదల చేసారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ట్రయిలర్ ను కట్ చేసారు దర్శకుడు కళ్యాణ్. రేవతి, జ్యోతిక కలిసి ట్రయిలర్ లో ఫన్ పండించడమే కాదు, యాక్షన్ సీన్లు కూడా విరగదీసారు. 

సాధారణంగా ఇలాంటి సినిమాలు కాస్త తమిళవాసనతో వుంటాయి. కానీ జాక్ పాట్ ట్రయిలర్ చూస్తుంటే తెలుగు వాళ్లని కూడా కాస్త ఆకట్టుకునేలాగే వుంది. పైగా రేవతి, జ్యోతిక తెలుగువారికి బాగా పరిచయం వున్న హీరోయిన్లు కదా. పైగా ట్రయిలర్ లో కనిపిస్తున్న చాలా మంది నటులు జనాలకు డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమైన మొహాలే. 

2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు.