థియేటర్లకు సమంత

ఈ జనరేషన్ హీరోలు, హీరోయిన్లు సమంతను చూసి నేర్చుకోవాల్సింది ఎంతయినా వుంది. కేవలం సినిమాలో నటించి, తన పారితోషికం తీసుకుని వదిలేయడం కాదు, సినిమా విడుదలకు నెలరోజులు ముందు నుంచి పగలు, రాత్రి అని…

ఈ జనరేషన్ హీరోలు, హీరోయిన్లు సమంతను చూసి నేర్చుకోవాల్సింది ఎంతయినా వుంది. కేవలం సినిమాలో నటించి, తన పారితోషికం తీసుకుని వదిలేయడం కాదు, సినిమా విడుదలకు నెలరోజులు ముందు నుంచి పగలు, రాత్రి అని తేడా లేకుండా, టైమ్ చూసుకోకుండా సినిమా ప్రచారం కోసం కష్టపడడం అన్నది సమంతను చూసి నేర్చుకోవాలి. యుటర్న్, మజిలీ, ఇప్పుడు ఓ బేబీ.

ఈ మూడు సినిమాల కోసం ఆమె చేసిన పబ్లిసిటీ వర్క్ ఇంతా అంతా కాదు. పెద్ద హీరోయిన్ అని పట్టింపు లేకుండా సినిమా కమర్షియల్ సక్సెస్ కోసం కిందామీదా అయిపోతూందామె. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో థియేటర్ల విజిట్ కు కూడా వెళ్లి వచ్చింది సమంత.

అంతేకాదు, ఆంధ్రలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, లాంటి కీలక లోకేషన్లకు వెళ్లి థియేటర్లు విజిట్ చేయాలనే ఆలోచనలో వున్నారు సమంత-నందినీ రెడ్డి. ఈ రేంజ్ హీరోయిన్లు థియేటర్లు విజిట్ చేసింది చాలా తక్కువ. సమంత వస్తే థియేటర్ల వద్ద జనాల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే.

ఇవన్నీ దృష్టిలో వుంచుకుని థియేటర్ల విజిట్ మీద సమంత నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?