కళ్యాణ్ రామ్.. ఎంత మంచి వాడో..

కళ్యాణ్ రామ్ కొన్నాళ్ల క్రితం మంచి లక్షణాలున్న అబ్బాయ్ (ఎమ్ఎల్ఎ) అనిపించుకున్నాడు. ఆ తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా సరైన టైటిళ్లు సెట్ కాలేదు. త్వరలో రావణ టైటిల్ తో ఓ సినిమా…

కళ్యాణ్ రామ్ కొన్నాళ్ల క్రితం మంచి లక్షణాలున్న అబ్బాయ్ (ఎమ్ఎల్ఎ) అనిపించుకున్నాడు. ఆ తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా సరైన టైటిళ్లు సెట్ కాలేదు. త్వరలో రావణ టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రావణ సంగతి అలావుంచితే ఇప్పుడు మరో మాంచి టైటిల్ పట్టేసి, తన సినిమాకు పెట్టేసుకున్నాడు.

శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం వంటి ఫీల్ గుడ్ టైటిళ్లతో సినిమాలు అందించిన దర్శకుడు సతీష్ వేగ్నిశ డైరక్షన్లో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు టైటిల్ రేపు అనౌన్స్ చేయబోతున్నారు. 'ఎంత మంచి వాడవురా' అన్నది టైటిల్ అని తెలుస్తోంది.

మాంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ కు కాస్త ఎంటర్ టైన్ మెంట్ జోడించి తయారుచేసిన సబ్జెక్ట్ ను కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మెహరీన్ కథానాయిక. గోపీసుందర్ సంగీతం. ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మిస్తోంది.

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?