అలంద మీడియా ఫిర్యాదుల మేరకు నమోదైన కేసుల్లో నిందితుడు అయిన నటుడు శివాజీ ఎట్టకేలకూ దొరికాడు. ఇప్పటికే పలుమార్లు అతడికి విచారణ నిమిత్తం నోటీసులు జారీ అయ్యాయి. అయితే అతడు పోలీసులు ముందుకు రావడం లేదు. విచారణకు తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు.
అలా పరారీలో ఉంటూ వీడియోలు విడుదల చేశాడు. తను పరారీ కాలేదని చెప్పుకొచ్చాడు. తనకు వడదెబ్బ తగిలిందని చెప్పుకొచ్చాడు. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా శివాజీ పోలీసుల ముందు మాత్రం హాజరు కాలేదు.
ఇలాంటి క్రమంలో అతడు ఎయిర్ పోర్టులో పట్టుబడటం గమనార్హం. అమెరికాకు వెళ్లిపోయే ప్రయత్నంలో ఉండగా.. శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. అతడిపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసు జారీ అయి ఉంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా విదేశానికి పరార్ అయ్యే ప్రయత్నంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో శివాజీ దొరికాడు. ఎన్నో నీతులు చెప్పి, ఆపరేషన్ గరుడ అంటూ హడావుడి చేసిన ఈ నటుడు .. ఇలా చీటింగ్ కేసులో పరార్ అవుతూ పట్టుబడటం గమనార్హం.