పెళ్లి అనేది మూర్ఖ‌త్వం

బాలీవుడ్ స్టార్ క‌పుల్ అమీర్‌ఖాన్‌, కిర‌ణ్‌రావు విడిపోవ‌డంపై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో స్పందించారు. వాళ్లిద్ద‌రు విడిపోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తోండ‌డంపై ఆయ‌న గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. వాళ్ల‌కు…

బాలీవుడ్ స్టార్ క‌పుల్ అమీర్‌ఖాన్‌, కిర‌ణ్‌రావు విడిపోవ‌డంపై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో స్పందించారు. వాళ్లిద్ద‌రు విడిపోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తోండ‌డంపై ఆయ‌న గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. వాళ్ల‌కు లేని బాధ మీకేంట‌ని? ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. అలాగే పెళ్లిపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారాయ‌న‌.

‘ అమీర్‌ఖాన్‌-కిరణ్‌రావు ఎలాంటి బాధ లేకుండా విడిపోవడానికి సిద్ధమైనప్పుడు.. ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్లందరూ ఎందుకు ఇబ్బందిపడుతున్నారు. వాళ్ల గురించి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు?. అమీర్‌, కిరణ్‌రావు.. భవిష్యత్తులో మీ వ్యక్తిగత జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. 

ఇంతకుముందు లేని విధంగా ఇకపై మీ జీవితాలు మరింత రంగులమయంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా దృష్టిలో వివాహం కంటే విడాకులనే ఎక్కువ సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఎందుకంటే వివాహం అనేది మూర్ఖత్వం, అజ్ఞానంతో ముడిపడి ఉన్నది. కానీ విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో కూడుకున్న పని’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇదిలా వుండ‌గా 15 ఏళ్ల వివాహ బంధానికి అమీర్‌ఖాన్‌, కిర‌ణ్‌రావు నిన్న ముగింపు ప‌ల‌క‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ విష‌య‌మై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అమీర్‌ఖాన్ మొద‌టి భార్య రీనా ద‌త్త నుంచి విడాకులు తీసుకున్న త‌ర్వాత, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కే చెందిన కిర‌ణ్‌రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడున్నాడు. విడాకుల అనంత‌రం కుమారుడి బాధ్య‌త‌ల‌ను తామిద్ద‌రూ చూసుకుంటామ‌ని వారు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.