ఆస్తి ఉంటేనే ఎవరికైనా అస్తిత్వం ఉంటుంది. ఉండడానికి గూడు ప్రతీ వారికీ అవసరం. ఈ రోజులలో సొంత ఇంటి కల అన్నది నిజంగా కలగానే ఉంది.
ఇక విభజన ఏపీలో విశాఖపట్నం నంబర్ వన్ సిటీ. పైగా దాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ సర్కార్ ప్రకటించింది. దాంతో విశాఖలో గజం జాగా ఉంటే చాలు వాడు కోటీశ్వరుడే. అలాంటిది జగన్ ప్రభుత్వం ఏకంగా పక్కా ఇళ్ళను కట్టిస్తూ పెద్ద ఎత్తున ఆస్తినే వారికి ఇస్తోంది.
ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూసినా విశాఖలో ఒక్కో ఇల్లూ కచ్చితంగా పాతిక లక్షలు చేస్తాయి. దీనిని బట్టీ చూస్తే భవిష్యత్తులో లబ్దిదారులు అంతా కోటీశ్వరులే అన్న మాట మేధావుల నుంచి ఉంది. దీని మీద మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖలో చిన్న పాటి ఇల్లు కట్టుకుందామన్నా సామాన్యుడుకి కుదిరే పరిస్థితి లేదు.
అలాంటి ప్రైమ్ ఏరియాలో జగన్ వేలాది మందికి సొంత ఇళ్ళు నిర్మించి ఇవ్వడం అంటే నిజంగా ఇక్కడి ప్రజలు అదృష్టవంతులు అని పేర్కొన్నారు.
ఆయన మాట ఒక విధంగా అక్షర సత్యమనే అనుకోవాలి. ఈ రోజు ఇల్లు పొందిన వారంతా రాజధాని పౌరులు కిందనే లెక్క మరి. సో ఇంతటి ఆస్తిని పంచిన జగన్ మా దేవుడు అని లబ్దిదారులు అంటున్నారంటే అందులో విశేషం ఏముంది.