పరిటాల శ్రీరామ్‌.. చలో సింగపూర్‌ అంటారా?

ఈ ఎన్నికల్లో తన తనయుడు శ్రీరామ్‌ను పోటీ చేయించేందుకువ పరిటాల సునీత కూడా మొదట్లో అంత సానుకూలంగా లేదట. తనే మరోసారి పోటీచేయాలని ఆమె అనుకున్నారట. అయితే పరిటాల శ్రీరామ్‌ మాత్రం తన తల్లి…

ఈ ఎన్నికల్లో తన తనయుడు శ్రీరామ్‌ను పోటీ చేయించేందుకువ పరిటాల సునీత కూడా మొదట్లో అంత సానుకూలంగా లేదట. తనే మరోసారి పోటీచేయాలని ఆమె అనుకున్నారట. అయితే పరిటాల శ్రీరామ్‌ మాత్రం తన తల్లి మీద ఒత్తిడి చేసి టికెట్‌ సంపాదించుకున్నారని సమాచారం. ఆమె వారిస్తున్నా.. తనే పోటీకి దిగాలని అతడు పట్టు పట్టాడని చేసేది లేక సునీత తప్పుకుందని రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల ముందే వినిపించిన టాక్‌.

అవతల జేసీ సోదరుల తనయులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తూ ఉండటంతో.. తను కూడా రంగంలోకి దిగాలని పరిటాల శ్రీరామ్‌ ఉబలాటపడ్డాడని సమాచారం. జనాల్లో తమ పార్టీ పరిస్థితి, తమ కుటుంబానికి ఉన్న ఇమేజ్‌ ఏమిటో గమనించకుండా శ్రీరామ్‌ తనను తాను ఎక్కువగా ఊహించేసుకుని రంగంలోకి దిగాడని.. తీరా ఫలితం ఇలా వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

రాప్తాడులో పరిటాల కుటుంబం గత రెండు పర్యాయాలు నెగ్గడమే ఏదో జాక్‌పాట్‌గా అని చెప్పవచ్చు. రెండువేల తొమ్మిదిలో అతిస్వల్ప మెజారిటీతో పరిటాల సునీత నెగ్గారు.  అప్పుడు మద్దెలచెరువు సూరి వర్గం ఒక రెబల్‌ అభ్యర్థిని నిలపగా అతడు నాలుగైదు వేల ఓట్లను పొందారు. సునీతకు వచ్చిన మెజారిటీ రెండువేల స్థాయి అప్పుడు! ఇక గత ఎన్నికల్లో కూడా సునీత ఏదో బయటపడ్డారు. ఈసారి కూడా అన్ని రకాలుగానూ ప్రయత్నించింది పరిటాల కుటుంబం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదని టాక్‌.

అవతల ప్రకాష్‌రెడ్డి రెండుసార్లు ఓడిపోయి పేదవాడిగా మిగిలారు. పరిటాల కుటుంబం ఆర్థికశక్తి అతి భారీగా ఉంది. ఆ లెక్కనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రకాష్‌రెడ్డి ఈసారి విజయ దుందుభి మోగించారు. శ్రీరామ్‌ చిత్తు అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారా? లేక చలో సింగపూర్‌ అంటారా? అనేది రాప్తాడులో చర్చనీయాంశంగా మారింది.

నియోజకవర్గంలో గత ఐదేళ్లలో కొన్ని హత్యలు జరిగాయి. ప్రసాద్‌ రెడ్డి అనే వైఎస్సార్సీపీ నేతను దారుణంగా హత్యచేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఫ్యాక్షన్‌ ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా చర్చనీయాంశం అవుతోంది!

కోట్లు పెట్టుబడి పెట్టి.. అవినీతి రహిత పాలనకు ఒప్పుకుంటారా?