4 రోజుల్లో రూ.20 కోట్లు.. నిజంగా జాతిరత్నాలు వీళ్లు

చిన్న సినిమా.. తక్కువ బడ్జెట్.. నో స్టార్స్.. అయితేనేం సంచుల కొద్దీ పంచులేసి, జేబుల నిండా కలెక్షన్లు కొల్లగొడుతున్నారు జాతిరత్నాలు. అవును.. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి ఈ సినిమా అక్షరాలా 20 కోట్ల రూపాయల…

చిన్న సినిమా.. తక్కువ బడ్జెట్.. నో స్టార్స్.. అయితేనేం సంచుల కొద్దీ పంచులేసి, జేబుల నిండా కలెక్షన్లు కొల్లగొడుతున్నారు జాతిరత్నాలు. అవును.. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి ఈ సినిమా అక్షరాలా 20 కోట్ల రూపాయల షేర్ సాధించి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది.

శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా, రిలీజైన మొదటి రోజు, మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. అలా నిన్నటితో తొలి వారాంతం (4 రోజులు) పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల 76 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ముందుగా లిమిటెడ్ రిలీజ్ అనుకున్న ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే పూర్తిస్థాయిలో థియేటర్లు పెంచారు. అలా వీకెండ్ లో అల్లాడించిన ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతోంది. నైజాంలో ఇప్పటికే 7 కోట్ల షేర్ అందుకున్న జాతిరత్నాలు, అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల్లోకి ఎంటరైంది.

జాతిరత్నాలతో పాటు విడుదలైన శ్రీకారం సినిమాకు మొదటిరోజు మంచి వసూళ్లు వచ్చినప్పటికీ, రెండో రోజు నుంచి పడిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా సీడెడ్ తప్ప మరే ఏరియాలో వసూళ్లు రాబట్టం లేదు. అటు శ్రీవిష్ణు-రాజేంద్రప్రసాద్ నటించిన గాలిసంపత్ సినిమా రిలీజైన రోజే వాష్ అవుట్ అయింది. 

ఇంత మాస్ క్యారెక్ట‌ర్ నా కెరియ‌ర్ లో ఎప్పుడు చేయ‌లేదు

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు