ఆర్ఆర్ఆర్..మరో కొత్త పాత్రలో అలియా

డిఫరెంట్ క్యారెక్టర్లు పోషించడం అలియాభట్ కు కొత్తకాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ఆమె పాత్రల ఎంపిక విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ వస్తోంది. ఇలాంటి హీరోయిన్ ఆర్ఆర్ఆర్ సినిమాను కేవలం రాజమౌళి కోసం ఒప్పుకోదనే…

డిఫరెంట్ క్యారెక్టర్లు పోషించడం అలియాభట్ కు కొత్తకాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ఆమె పాత్రల ఎంపిక విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ వస్తోంది. ఇలాంటి హీరోయిన్ ఆర్ఆర్ఆర్ సినిమాను కేవలం రాజమౌళి కోసం ఒప్పుకోదనే విషయాన్ని చాలామంది గ్రహించారు. అది నిజమే, ఆర్ఆర్ఆర్ లో అలియాభట్ పాత్ర కూడా చాలా కీలకం.

ఈరోజు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి అలియా భట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సీత పాత్రలో అలియా సంప్రదాయబద్ధంగా చీరకట్టులో కనిపిస్తోంది. ఆమె హెయిర్ స్టయిల్ నుంచి లుక్స్ వరకు అన్నీ కొత్తగా, ప్రత్యేకంగా ఉన్నాయి.

రామరాజు (రామ్ చరణ్) కోసం ఎదురుచూస్తున్న సీత పాత్రలో అలియాభట్ లుక్స్ బాగున్నాయి. ఫస్ట్ లుక్ రిలీజ్ లో భాగంగా ఆత్మస్థైర్యం మెండుగా ఉన్న వనితగా సీత పాత్రను అభివర్ణించాడు రాజమౌళి. అలియా ఫస్ట్ లుక్ తో బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు మంచి బజ్ వచ్చింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ పీరియాడిక్ ఫిక్షన్ డ్రామాలో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే అతడి ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేయబోతున్నారు. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు.

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం