సునీల్ కు లిట్మస్ టెస్ట్

కమెడియన్ నుంచి హీరోగా మారి, మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా వస్తున్నాడు సునీల్. కమెడియన్ గా సునీల్ క్లిక్ కావడం వెనుక త్రివిక్రమ్ రైటింగ్ పవర్ చాలా వుంది. సునీల్ కోసం అతగాడు కామెడీ…

కమెడియన్ నుంచి హీరోగా మారి, మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా వస్తున్నాడు సునీల్. కమెడియన్ గా సునీల్ క్లిక్ కావడం వెనుక త్రివిక్రమ్ రైటింగ్ పవర్ చాలా వుంది. సునీల్ కోసం అతగాడు కామెడీ వేషాలు వేసిన అనేక సినిమాలు బ్యాక్ ఎండ్ లో త్రివిక్రమ్ హెల్ప్ చేసాడు. మళ్లీ అదే త్రివిక్రమ్ ఇప్పుడు సునీల్ ను కమెడియన్ గా మళ్లీ నిలబెట్టాలని సాయంచేస్తూ, అరవింద సమేత వీర రాఘవలో ఫుల్ లెంగ్త్ పాత్ర ఇచ్చాడు.

సినిమాలో డ్యూయట్లు, ఫైట్లు తప్ప, మిగిలిన సినిమా అంతా సునీల్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సునీల్ ఆటోగ్యారేజ్ ఓనర్ గా కనిపిస్తాడని వినికిడి. సునీల్ హీరో నుంచి మళ్లీ కమెడియన్ గా మారుతున్న తొలి సినిమా ఇది. దీని తరువాత రాబోయే శర్వానంద్ సినిమాలో, అలాగే త్వరలో తీయబోయే సాయిధరమ్ తేజ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్ సునీల్ చేస్తున్నాడు.

ఇటీవలే సిల్లీఫెలోస్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ వేషం కమ్ హీరో వేషం చేసాడు కానీ పెద్దగా క్లిక్ కాలేదు. అందువల్ల అరవింద సమేతనే ఇప్పుడు సునీల్ కు పెద్దపరీక్ష. సునీల్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ రైటింగ్. ఈ రెండు కలిసిన తరువాత కూడా ఆ పాత్ర పండకపోతే వృధా. అందువల్ల సునీల్ కమెడియన్ కెరీర్ ముందుకు సాగడానికి అరవిందనే లిట్మస్ టెస్ట్ అనుకోవాలి.