జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నానికి మారుపేరుగా నిలిచారు. యువ ముఖ్య‌మంత్రిగా పాల‌న‌లో వినూత్న మార్పుల‌కు జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్ట‌డం యావ‌త్ దేశ దృష్టిని ఆక‌ర్షించింది. గ్రామాల్లో స‌చివాల‌యాల ఏర్పాటు, ల‌క్ష‌కు పైబ‌డి రెగ్యుల‌ర్ స‌చివాల‌య…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నానికి మారుపేరుగా నిలిచారు. యువ ముఖ్య‌మంత్రిగా పాల‌న‌లో వినూత్న మార్పుల‌కు జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్ట‌డం యావ‌త్ దేశ దృష్టిని ఆక‌ర్షించింది. గ్రామాల్లో స‌చివాల‌యాల ఏర్పాటు, ల‌క్ష‌కు పైబ‌డి రెగ్యుల‌ర్ స‌చివాల‌య ఉద్యోగుల నియ‌మాకం, అలాగే ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఓ వాలంటీర్ చొప్పున ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల‌కు ఉపాధితో పాటు సేవ‌ల‌ను ప్ర‌జ‌ల చెంత‌కు తీసుకెళ్ల‌డంతో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు.

ఈ నేప‌థ్యంలో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యానికి జ‌గ‌న్ తెర లేపారు. దేశంలోనే తొలిసారిగా జెండ‌ర్ బ‌డ్జెట్‌ను మ‌హిళ‌ల కోసం ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. 

ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక వేడుక‌లో సీఎం మాట్లాడుతూ జెండ‌ర్ బ‌డ్జెట్ గురించి చెప్పుకొచ్చారు. మహిళ అంటే ఆకాశంలో సగ భాగమని.. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు.

గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన‌ట్టు సీఎం చెప్పారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చిన‌ట్టు జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.  చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా 900 దిశ పెట్రోల్‌ వెహికల్స్‌, 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జీపీఎస్‌, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్‌లను సీఎం ఆవిష్కరించారు. అలాగే బాలికలకు ఉచిత నాప్‌కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా  ఆయ‌న‌ ప్రారంభించారు.