ఓపెనింగ్ రోజే ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్?

అన్నీ అనుకున్నట్టు జరిగితే సినిమా ప్రారంభోత్సవం రోజునే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా గెటప్ కు సంబంధించి చిరంజీవి ఇప్పటికే మేకోవర్ ప్రారంభించారు. మరోవైపు…

అన్నీ అనుకున్నట్టు జరిగితే సినిమా ప్రారంభోత్సవం రోజునే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా గెటప్ కు సంబంధించి చిరంజీవి ఇప్పటికే మేకోవర్ ప్రారంభించారు. మరోవైపు గెటప్ కోసం కొన్ని స్కెచ్ లు రెడీచేశారు. చిరంజీవి కొత్త గెటప్ తో మొదటి దశ ఫొటో షూట్ కూడా కంప్లీట్ చేశారు.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టు లాంచ్ అవుతుంది. అంతకంటే ముందే గెటప్ కూడా ఫిక్స్ అయిపోతుంది. సో.. కుదిరితే లాంచింగ్ రోజునే తన గెటప్ తో స్టిల్ రిలీజ్ చేయాలని చిరు భావిస్తున్నారు. అలా ఓపెనింగ్ రోజునే ఫస్ట్ లుక్ లాంచ్ చేసి హల్ చల్ చేయాలనేది ప్లాన్.

ఈమధ్య రజనీకాంత్ కూడా అదే పనిచేశారు. సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సరిగ్గా 4 రోజుల ముందు కాలా టైటిల్ లోగో రిలీజ్ చేశారు. అదే రోజు సాయంత్రం ఫస్ట్ లుక్ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. దీంతో కాలా ప్రాజెక్టుపై ఎక్కడలేని క్రేజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు చిరు కూడా ఉయ్యాలవాడ విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట.