ఆ మాత్రం చూపిస్తే తప్పా…? అంటున్న జబర్ధస్త్ రష్మీ!

టీవీ యాంకరింగ్ కు గ్లామర్ ను తెచ్చేసిన వాళ్లలో అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వాళ్లు ముందున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రియాలిటీ షోలు, కామెడీ షోలు అంటూ వీళ్లు హాట్ హాట్ కామెంట్స్ తో,…

టీవీ యాంకరింగ్ కు గ్లామర్ ను తెచ్చేసిన వాళ్లలో అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వాళ్లు ముందున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రియాలిటీ షోలు, కామెడీ షోలు అంటూ వీళ్లు హాట్ హాట్ కామెంట్స్ తో, అడాల్ట్ జోకులతో, అందాల ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నారు. వీళ్లకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ నే కలిగి ఉన్నారు. అంతే కాదు.. బుల్లితెరపై వీరు సంపాదించుకున్న పాపులారిటీని చూసి సినిమా అవకాశాలు వీళ్లను వెదుక్కొంటూ వస్తున్నాయి. వీళ్లను సినిమాల్లో నటింపజేయడానికి, వీరి చేత ఐటమ్ సాంగ్స్ చేయించడానికి టాలీవుడ్ మూవీ మేకర్లు ఉత్సాహంగా ఉన్నారు.

మరి ఈ సంగతంతా ఇలా ఉంటే.. ఈ టీవీ ప్రజెంటర్ల మీద విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వీరి యాంకరింగ్ వల్గర్ గా ఉంటుందనేది ప్రధానమైన విమర్శ. ఇలాంటి విమర్శలను వీరు పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ పని తాము చేసుకొంటూ పోతున్నారు. అయినప్పటికీ ఇలాంటి విమర్శల పట్ల వీళ్ల సమాధానమైతే ఉంది. అది సమాధానాన్ని ఘాటుగానే చెప్పింది జబర్ధస్త్ రష్మీ.

ఇంతకీ ఈమె ఏమంటుందంటే.. ‘ఆ మాత్రం చూపిస్తే తప్పా..’ అని. బుల్లి తెరపై చిట్టిపొట్టి దుస్తులతో కనిపించే ఈమె తమ దుస్తుల్లో వల్గారిటీని చూడవద్దని స్పష్టం చేస్తోంది. దీనికి ఆమె ఒక లాజిక్ కూడా చెప్పింది. ‘సినిమాల్లో హీరోయిన్లుగా చేస్తూ బికినీలు వేసినా, ఇష్టానుసారం ఎక్స్ పోజింగ్ చేసినా, హాట్ సీన్లలో నటించినా ఎవరూ అభ్యంతరం చెప్పారు. చాలా మంది హీరోయిన్లు అదే పని చేస్తున్నారు. అయితే.. టీవీల్లో కాస్త డ్రస్ పైకి వేసుకుని వచ్చినా, క్లీవేజ్ కనిపించేలా డ్రస్సింగ్ చేసుకొచ్చినా.. గగ్గోలు పెడతారు..’ అంటూ రష్మీ ఎదురుదాడి చేసింది. మొత్తానికి ఎవరి లాజిక్కులు వారికున్నాయి.