మొత్తానికి గడచిన కొద్ది కాలంగా సాగుతున్న శాతకర్ణి-ఖైదీ ఫైట్ లో మెగా క్యాంప్ పై చేయి సాధించింది. చాలా తెలివిగా శాతకర్ణికి దెబ్బేసింది. ఇదెక్కడ ప్రారంభమైందీ అంటే, ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల డేట్ దగ్గర నుంచి. వాస్తవానికి ఆరంభం నుంచీ ఖైదీ డేట్ జనవరి 13 అని వినిపిస్తోంది. దీంతో శాతకర్ణి జనవరి 12న అని ఫిక్సయింది. ఇవన్నీ లోలోపల వ్యవహారాలే. అలా అయితే తాము 11న వస్తామని ఖైదీ వైపు నుంచి ఫీలర్లు ప్రారంభమయ్యాయి. అప్పుడు తాము కూడా 11 విడుదలకు సై అని శాతకర్ణి వైపు నుంచి వార్తలు వినిపించడం ప్రారంభమైంది.
ఇలా ఇన్ని వినిపిస్తున్నా, ఎవరూ అధికారికంగా ఫ్రకటించకుండా ఎదుటి వారి కోసం చూస్తూ వస్తున్నారు. ఖైదీ 11న అని అంటే చాలు తాము కూడా 11న అని ప్రకటించేయాలని శాతకర్ణి ఎదురు చూసింది. ఇది చాలా ఇబ్బంది కర పరిస్థితి ఖైదీకి. లేని పోని తలకాయ నొప్పి. దీన్నెలా తప్పించుకోవాలి? 11న పోటీలేకుండా ఎలారావాలి? అందుకే మంచి స్ట్రాటజీ వేసింది. ఖైదీ విడుదల 13న అని అధికారికంగా కాకున్నా, ఒక్కసారిగా హడావుడి జరిగిపోయింది. ట్విట్ లు, సోషల నెట్ వర్క్ పోస్టింగ్ లు చకచకా జరిగిపోయాయి.
హమ్మయ్య..వాళ్లే వెనక్కు తగ్గారు అనుకుని, శాతకర్ణి 12న తమ డేట్ అని ప్రకటించేసింది. ఇప్పుడేమయింది. ఖైదీ యూనిట్ డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ పెట్టి, సైలెంట్ 11న తమ విడుదల డేట్ అని అనౌన్స్ చేసింది. ఇంకేముంది శాతకర్ణి ఖేల్ ఖతమ్..దుకాణ్ బంద్. లేదూ అంటే తూచ్..మేమూ 11న వస్తాం అని ప్రకటించాలి. అలా చేయలగరా? ఏమో?