ఇటీవలే అక్కినేని అఖిల్ నిశ్చితార్థపు వేడుక జరిగింది. మరి ‘తమ్ముడి తర్వాతే.. నేను..’ అని ప్రకటించిన నాగ చైతన్య కూడా ఇప్పుడు నిశ్చితార్థానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు చైతూ-సమంతల ఎంగేజ్ మెంట్ కు డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెలలోనే చైతూ-సమంత నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. 2017 జనవరి 29 వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారని సమాచారం. అంటే ఆ కార్యానికి మరెంతో దూరం లేనట్టే!
ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. వివాహ పద్ధతి విషయంలో తమ్ముడు అఖిల్ నే అనుసరించనున్నాడట చైతూ. ఈ హీరోది, ఇతడి హీరోయిన్ వివాహం కూడా.. డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలోనే జరగనున్నట్టుగా తెలుస్తోంది.