చెట్టునే నమ్ముతాం.. అబ్బాయ్ పై నందమూరి ఫ్యాన్స్ ఫైర్!

మొత్తానికి సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలు నందమూరి ఫ్యాన్స్ మధ్యన మంటపెట్టాయి. ప్రత్యేకించి గత రెండు మూడు సంవత్సరాలుగా బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్యన విబేధాలను ఇప్పుడు రచ్చకీడ్చేలా ఉన్నాయి. ఇన్ని రోజులూ అంతర్గతంగా ఉన్న…

మొత్తానికి సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలు నందమూరి ఫ్యాన్స్ మధ్యన మంటపెట్టాయి. ప్రత్యేకించి గత రెండు మూడు సంవత్సరాలుగా బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్యన విబేధాలను ఇప్పుడు రచ్చకీడ్చేలా ఉన్నాయి. ఇన్ని రోజులూ అంతర్గతంగా ఉన్న విబేధాలు ఇప్పుడు బహిర్గతం అయిన పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అభిమానుల్లో మెజారిటీ వర్గం బాలయ్య తరపునే నిలబడుతున్నారు. బాలయ్య సీనియర్ కావడం, జూనియర్ ఎన్టీఆర్ అపరిపక్వత కొద్దీ బాలయ్యతో ఢీ కొనే ప్రయత్నాలు చేస్తున్నాడనే అభిప్రాయాలు వీరి నుంచి వినిపిస్తున్నాయి.  అయితే జూనియర్ ఎన్టీఆర్ కేమీ అభిమానుల మద్దతు తక్కువేమీ కాదు.

ఇంకా లోతుగా మాట్లాడుకొంటే.. కమ్మ సామాజికవర్గంలోనే ఇప్పుడు ఈ చిన్న తేడా వచ్చింది. సాలిడ్ గా నందమూరి ఫ్యామిలీని అభిమానించే కమ్మ వాళ్లలో ఇప్పుడు బాలయ్య, చిన్న ఎన్టీఆర్ అనే తేడాలు మొదలయ్యాయి.  ఇన్ని రోజులూ వేరే సినిమా హీరోల అభిమానులతో ఎలాంటి విరోధం ఉండేదో.. ఇప్పుడు బాలయ్య, చిన్న ఎన్టీఆర్ అభిమానుల మధ్య విరోధం కూడా అదే స్థాయికి చేరింది. కోస్తా ఏరియాలో.. బాలయ్య, చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య అప్పుడే గొడవలు కొట్టుకునేంత స్థాయి వరకూ వెళ్లాయంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ప్రత్యేకించి.. బాలయ్య అభిమానుల నుంచి ఒకే కంప్లైంట్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అతి చేస్తున్నాడని, ఎక్కువగా ఆశిస్తున్నాడని వారు అంటున్నారు. 

“టాలెంట్ ఉంటే సరిపోదురా అబ్బాయ్.. 
ఎవరి పేరు చెప్పుకోని నువ్వు ఇక్కడి దాకా వచ్చావో మర్చిపోయావ్.
చూసాం ఓపికగా, కాని ఇంకా ఇంకా రెచ్చిపోతున్నావ్.
నిన్ను తీసేస్తున్నారా అబ్బాయ్.
ఆ వంశానికి వారసుడు వేరే ఉన్నాడు..
నువ్ ఇంక పక్కకి వెళ్ళి ఆడుకో..
మేము చెట్టునే నమ్ముతాం, అభిమానిస్తాం. 
నిన్నా మొన్నా పుట్టిన కుక్క మూతి పిందెలు వద్దు రా బాబు..''

ఇదీ నందమూరి అభిమానులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్న ఒక మెసేజ్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి!