గబ్బర్ సింగ్ 2 అటకెక్కిందా?

ఈ శీర్షిక చదవగానే, తెల్లవారి పత్రికలు చూడవా..షూటింగ్ ప్రారంభమైంది…పవన్ బాబు గడ్డం తీసి మరీ షూటింగ్ లో పాల్లొని, డైరక్టర్ బాబీతో కలిపి ఓ ఫొటో కూడా విడుదల చేసాడు చూడలేదా అని అడిగేస్తారు..ఫ్యాన్స్.…

ఈ శీర్షిక చదవగానే, తెల్లవారి పత్రికలు చూడవా..షూటింగ్ ప్రారంభమైంది…పవన్ బాబు గడ్డం తీసి మరీ షూటింగ్ లో పాల్లొని, డైరక్టర్ బాబీతో కలిపి ఓ ఫొటో కూడా విడుదల చేసాడు చూడలేదా అని అడిగేస్తారు..ఫ్యాన్స్.  కానీ విషయం వేరు. గబ్బర్ సింగ్ 2 సినిమా కథ నిజంగా ఓ మాంచి సినిమా కథ అన్ని మలుపులు తిరిగింది. సంపత్ నంది కథ తయారుచేసారు. అది పవన్ కు కొంత నచ్చింది..కొంత నచ్చలేదు అని టాక్. సీన్ మారి డైరక్టర్ బాబి లైన్లోకి వచ్చారు. మళ్లీ కథకు కొత్త సొగసులు వచ్చాయి.  అయితే ఇక్కడకు అది ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే. అసలు ట్విస్ట్ వేరే వుంది.

మళ్లీ పవన్ కథకు వేరే మెరుగులు దిద్దాలనుకున్నారు. వన్ ఫైన్ మార్నింగ్ ఆయనకు కొత్త కథ బుర్రలొకి వచ్చిందని టాలీవుడ్ టాక్. దాంతో ఓ అసోసియేట్ డైరక్టర్ ను నేరుగా బెంగళూరుకు పిలిచి కథ వినిపించి, దాన్ని తయారు చేయమన్నారని తెలుస్తోంది. దాని తరువాత మరో సారి డైరక్టర్ బాబితో కలిసి దానికి ఫైనల్ మెరుగులు దిద్దారని అంటున్నారు. సో..దానా దీనా వచ్చిన ఫలితం ఏమిటంటే అక్కడ గబ్బర్ సింగ్ 2 మాయమై సర్దార్ ప్రత్యక్షమయ్యాడు.

అంటే అర్థమయ్యింది కదా..ఇప్పుడు తెరకెక్కుతున్నది సర్దార్ కథ అని టాలీవుడ్ గుసగుసల సారాంశం. గబ్బర్ సింగ్ 2 అని పేరు మార్చేసింది అందుకేనట. పోలీసు అధికారి, గబ్బర్ సింగ్ సినిమాలో హీరో, టైపు క్యారెక్టరే కానీ, ఇది గబ్బర్ సింగ్ కి సీక్వెల్ మాదిరిగా మాత్రం వుందని తెలుస్తోంది.అందుకే టైటిల్ మార్చారు. అంతే కాదు, స్వతహాగా రచయిత అయిన దర్శకుడు బాబిని కాదని, బుర్రా సాయి మాధవ్ చేత మాటలు రాయిస్తున్నారు. పవన్ కథను అసొసియేట్ కు డిక్టేట్ చేసారని రూమర్ వినిపిస్తోంది. మాటలు బుర్రా రాస్తున్నారు. డైరక్షన్ ఎలాగూ పవన్ కనుసన్నలలో నడుస్తుంది. ఎందుకంటే, నిన్నటికి నిన్న విడుదల చేసిన తొలి లుక్ పోస్టర్ నే పవన్ స్వయంగా డిజైన్ చేసారని ప్రెస్ నోట్ లో పాల్గొన్నారు. పోస్టర్ లాంటి చిన్న విషయాన్నే పవన్ డిజైన్ చేసినపుడు, డైరక్షన్ మాత్రం వదులుతారా? అంటే ఈ సినిమాకు డైరక్టర్ బాబి ఏం చేస్తారో?