చరణ్-గౌతమ్ మీనన్ ఎప్పుడు?

రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని గౌతమ్ మీనన్ అనుకున్నాడు. ఒకటికి రెండు సార్లు కలిసి లైన్ కూడా చెప్పాడు. ఆ ప్రాజెక్టు చేయలని డిసైడ్ అయ్యారు కూడా. కానీ ఆ తరువాత…

రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని గౌతమ్ మీనన్ అనుకున్నాడు. ఒకటికి రెండు సార్లు కలిసి లైన్ కూడా చెప్పాడు. ఆ ప్రాజెక్టు చేయలని డిసైడ్ అయ్యారు కూడా. కానీ ఆ తరువాత గౌతమ్ మీనన్ తాను నాగచైతన్యతో చేసే త్రిబుల్ ఎస్ సినిమాపై బిజీ అయిపోయాడు. చరణ్ కూడా అప్పటికి బ్రూస్ లీ పనిలో వున్నాడు. ఇప్పుడు ఇక మరో నెలలో గౌతమ్ ఖాళీ అవుతాడు. చెర్రీ ఖాళీగా వున్నాడు. మరి ఆ ప్రాజెక్టు సంగతేమిటో?

చాలా కాలంగా యువి క్రియేషన్స్ కు చరణ్ ఓ సినిమా చేయాల్సి వుంది..అయితే దానికి డైరక్టర్ ఇంకా ఫిక్స్ కాలేదు. గతంలో మారుతిని కూడా ఆ ప్రాజెక్టు కు కథ అడిగినట్లు వినికిడి. జస్ట్ ఒక రోజు కిందటే చెర్రీ విదేశాల నుంచి తిరిగి వచ్చాడు.అందువల్ల ఇక కొద్ది రోజుల్లో చరణ్ చేయబోయే ప్రాజెక్టులపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.