కళ్యాణ్‌తో నితిన్‌ ప్రాబ్లెమేంటి?

నితిన్‌ ఏనాడో మొదలు పెట్టిన ‘కొరియర్‌బాయ్‌ కళ్యాణ్‌’ ఎప్పుడో విడుదల కావాల్సింది. ‘ఇష్క్‌’ తర్వాత నితిన్‌ చేసిన ఈ చిత్రం ఇంతవరకు విడుదల కాలేదు. ట్రెయిలర్స్‌ కూడా ఎప్పుడో బయటకు వదిలినా ఈ ‘కొరియర్‌’…

నితిన్‌ ఏనాడో మొదలు పెట్టిన ‘కొరియర్‌బాయ్‌ కళ్యాణ్‌’ ఎప్పుడో విడుదల కావాల్సింది. ‘ఇష్క్‌’ తర్వాత నితిన్‌ చేసిన ఈ చిత్రం ఇంతవరకు విడుదల కాలేదు. ట్రెయిలర్స్‌ కూడా ఎప్పుడో బయటకు వదిలినా ఈ ‘కొరియర్‌’ ఇంకా ఎందుకు డెలివరీ అవలేదు? దీనిగురించి నితిన్‌ని అడిగితే ‘కొరియర్‌బాయ్‌ కళ్యాణ్‌’ తమిళ వెర్షన్‌ కారణంగానే లేట్‌ అవుతోందని చెప్పాడు. 

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారని… తెలుగు వెర్షన్‌ రెడీ అయినా కానీ తమిళంలో ఏవో సమస్యలు రావడం వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఇంకా పూర్తి కాలేదని, వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చునని నితిన్‌ చెప్పాడు. 

‘కొరియర్‌బాయ్‌ కళ్యాణ్‌’ డిలే అవడం వల్ల స్టేల్‌ అవుతుందనే భయం తనకి లేదని, ఈ పాయింట్‌ వేరే సినిమాలో వస్తుందనే టెన్షన్‌ కూడా లేదని, పాయింట్‌ అంత కొత్తగా ఉంటుందని, లేట్‌గా వచ్చినా కానీ ఫ్రెష్‌గా అనిపిస్తుందని నితిన్‌ తెలియజేసాడు. తన తదుపరి చిత్రం ఇంకా ఖరారు కాలేదని, ప్రస్తుతానికి అఖిల్‌ హీరోగా నిర్మిస్తున్న సినిమాపైనే దృష్టి పెట్టానన్నాడు.