బాలయ్య చేతిలో ‘బుడ్డోడి’ భవిత

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్ ఇప్పుడు బాలయ్య నిర్ణయంపై ఆధారపడి వుందా? తెలుగుదేశం పార్టీలోని అంతర్గత సర్కిళ్ల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య ఓకె అంటే మళ్లీ జూనియర్ ను తమలో కలిపేసుకుంటారు. లేదంటే…

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్ ఇప్పుడు బాలయ్య నిర్ణయంపై ఆధారపడి వుందా? తెలుగుదేశం పార్టీలోని అంతర్గత సర్కిళ్ల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య ఓకె అంటే మళ్లీ జూనియర్ ను తమలో కలిపేసుకుంటారు. లేదంటే ఇలాగే కొనసాగుతుంటుంది వ్యవహారం. దీని వెనుక నేపథ్యం ఇలా వుంది.

ఎన్నికలు కాస్త దూరంగా వున్న సమయంలో, లోకేష్ పార్టీ నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ అలిగారు..కొంచెం ఆగ్రహించారు. ఆ సమయంలో తన బలం బలగం ఎక్కువ అంచనా వేసుకున్నారో, లేక బాబు చాణక్యాన్ని తక్కువ అంచనా వేసారో,మొత్తానికి ఎదురెళ్లారు. అక్కడక్కడ ఆఫ్ ది రికార్డు డైలాగులు పేల్చడం, అవి మరి నాలుగు మాటలు జోడించుకుని బాబు దగ్గరకు చేరడం జరిగిపోయింది. దాంతో జరగాల్సిన డ్యామేజీ కూడా జరిగిపోయింది. కొన్ని అకేషన్లలో బాబు కనిపించినా పలకరించకపోవడం, పక్కకు తిరిగిపోవడం జరిగాయని కూడా టాక్.

సరే మొత్తం మీద దూరం పెరిగింది.  కానీ ఎన్నికల సమయంలో కాస్త జ్ఙానం కలిగింది. తను మీ వైపే అన్న సమాచారాన్ని పార్టీకి పంపారట. కానీ స్పందన కరవు. ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని ఎన్టీఆర్ భారీగా బెట్టింగ్ లు కూడా కాసాడని వదంతులు పుట్టించారు. అది నిజమో కాదో ఆయనకే తెలియాలి. ఇవన్నీ బాబును మరింత ఆగ్రహానికి గురిచేసాయి. ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి వచ్చారు.

ఆ తరువాత అసలు కథ మొదలైందని వినికిడి. ఎన్టీఆర్ లోకేష్ ను కలిసారో, కబురు చేసారో, మాట్లాడారో మొత్తానికి తాను సరెండర్ అనే విధమైన భావాన్ని వ్యక్తం చేసారట. దానిని  లోకేష్ తండ్రికి చేరవేసారట. దానికి చంద్రబాబు, తనదేమీ లేదని, బాలయ్యతో మాట్లాడుకోవమని, ఆయన ఎలా అంటే అలా చేద్దామని అన్నారట. బాలయ్య ఓకె అంటేనే మళ్లీ ఎన్టీఆర్ ను చేరదీద్దామని మొహమాటం లేకుండా స్పష్టం చేసారట. అదే సమాచారాన్ని లోకేష్ మళ్లీ ఎన్టీఆర్ కు చేరవేసారట.

అంటే ఇప్పుడు బంతి బాలయ్య కోర్టులో వుంది. ఆయన ఎస్ అంటే ఎన్టీఆర్ కు మళ్లీ మంచి రోజులు ప్రారంభమవుతాయని, తేలుగుదేశం జనాలు అంటున్నరు. కానీ బాలయ్య మాత్రం ఇంకా ఊ..ఆ..అనడం లేదట. ఎంతయినా తన అల్లుడితో సున్నం పెట్టుకున్నవాడు..అన్న కొడుకైతే మాత్రం..బాలయ్య అంత వేగిరం ఎలా ఓకె అనేస్తాడు. ఇంకా ఎన్ని రాయబారాలు నడవాలో..ఎవరు మాట్లాడాలో..బ్యాడ్ లక్ ఏమిటంటే, ఎన్టీఆర్ తరపున రాయబారం నడిపేవారు కూడా లేకపోవడం.

ఈ సమస్యలు తీరి ఎన్టీఆర్ ఎప్పుడు గట్టెక్కుతారో, ఓ మాంచి హిట్ తో మళ్లీ ఫామ్ లోకి ఎప్పుడువస్తారో?

చాణక్య

[email protected]