తనకు న్యాయం కావాలంటూ రచ్చకెక్కిన లావణ్య.. తాజాగా తన ప్రియుడు రాజ్ తరుణ్, ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు మధ్య పోలిక పెట్టింది. రాజ్ తరుణ్, పవన్ కల్యాణ్ లా బాధ్యతగా వ్యవహరించలేదంటోంది.
పవన్ కల్యాణ్ కు 3 పెళ్లిళ్లు అయ్యాయని, అయినప్పటికీ తన మాజీ భార్యలందర్నీ ఆయన బాగానే చూసుకున్నారని.. ఆ బాధ్యత రాజ్ తరుణ్ కు లేదని అంటోంది లావణ్య.
“పవన్ కల్యాణ్ కు కూడా 3 పెళ్లిళ్లు అయ్యాయి. ఆయన తన మాజీ భార్యలకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటారు. బాగానే చూసుకొని ఉంటారు. తన బాధ్యతను వదులుకొని ఉండరు. కానీ ఇక్కడ రాజ్ తరుణ్ నాకు అలా చేయలేదు. కనీసం భోజనం కూడా పెట్టకుండా నన్ను వదిలేశాడు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.”
తనకు దేవుళ్లలో శివుడు అంటే ఇష్టమని, అలాగే మనుషుల్లో పవన్ కల్యాణ్ అంటే ఇష్టమని అంటోంది లావణ్య. పవన్ కు తన గోడు చెప్పుకోవాలని ఉందంటూ వాపోయింది.
“శివుడు అంటే నాకు ఇష్టం, మనుషుల్లో పవన్ కల్యాణ్ అంటే ఇష్టం. ఆయన ఎప్పటికైనా సీఎం అవుతారు. ఆయన సినిమాకు మొదటి రోజు థియేటర్లలో పేపర్స్ ఎగరేశాను నేను. ఆయన్ను కలవాలనుకుంటున్నాను. రాజ్ తరుణ్ నన్ను వదిలేసి పారిపోయాడని పవన్ కల్యాణ్ తో చెప్పాలనుకుంటున్నాను.”
ప్రస్తుతం రాజ్ తరుణ్, తనకు అన్ని సౌకర్యాలు కట్ చేశాడని అంటోంది లావణ్య. ఓటీటీ యాక్సెస్ కట్ చేయడంతో పాటు, నెలవారీ మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.