Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

అదిగో సినిమా..ఇదిగో వార్త

అదిగో సినిమా..ఇదిగో వార్త

వార్తలు రెండు రకములు.ఒకటి సేకరణ రెండో కిట్టింపు లేదా పుట్టింపు. సేకరణ అసాధ్యం అయినపుడు, లేదా సాధ్యం కానపుడు పుట్టించాల్సిందే లేదా కిట్టించాల్సిందే. 

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా గురించి అలాంటి వార్త ఒకటి పురుడుపోసుకుంది. చౌడప్పనాయుడు అన్నది టైటిల్ అంటూ. సరే మామూలు వెబ్ మీడియా రాసుగుంది అంటే ఓకె అనుకోవచ్చు. 

ఓ లీడింగ్ ప్రింట్ మీడియా వెబ్ సైట్ వుంది. ఈ సైట్ కు ఒకటే అలవాటు. ఏ వెబ్ సైట్ లో వార్త కనిపించినా, జిరాక్స్ తీసుకుని వేసేసుకోవడం. అలాగే వేసేసుకున్నారు. 

కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఎన్టీఆర్ తో తీస్తున్నది పక్కా ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ సబ్జెక్ట్ నే కావాలని ఎన్టీఆర్ పట్టుపట్టిన సినిమా. పైగా నాయుడు, రెడ్డి, చౌదరి ఇలాంటి టైటిళ్లు సినిమాలో వుండడం త్రివిక్రమ్ కు ఇష్టం వుండదు.

ఇదిలా వుంటే మరో వార్త కూడా డెలవరీ అయింది. అయ్యప్పన్ కోషియమ్ కు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారని. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు రెండూ త్రివిక్రమ్ నే. పైగా పవన్ చేతిలో వున్న  సినిమాలు ఫినిష్ చేస్తే చాలు. స్క్రీన్ ప్లే రాసినంత పుణ్యం. 

ఆయన ఒక కాలు రాజకీయాల్లో మరో కాలు సినిమాల్లో పెట్టారు. ఇక స్క్రీన్ ప్లే రాసేంత సీన్ ఎక్కడ? కరోనా పుణ్యమా అని ఇలా వార్తలు కిట్టించాల్సిన పరిస్థితి వచ్చిందేమో?

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?