స్టార్ హీరోయిన్లపై ఎలాగూ అంచనాలుంటాయి. వాళ్ల సినిమాల కోసం ఎదురుచూసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఆశ్చర్యంగా ఈసారి కొత్త హీరోయిన్లపై బెట్టింగ్ పెరిగింది.
వాళ్ల అందాన్ని వెండితెరపై చూసేందుకు, వాళ్ల నటన ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేస్తున్నారు ముగ్గురు హీరోయిన్లు.
వీళ్లలో ముందు వరుసలో ఉంది సాత్విక వీరవల్లి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి, ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమౌతోంది. ఇందులో ఆమె యాక్టింగ్ చించేసిందనే టాక్ నడుస్తోంది.
అల్లు అరవింద్ లాంటి సీనియర్ నిర్మాత, అప్పుడే ఆమెతో 2 సినిమాలకు కాంట్రాక్ట్ చేసుకున్నారనే మేటర్ బయటకొచ్చినప్పట్నుంచి సాత్విక పేరు మరింత గట్టిగా వినిపిస్తోంది.
కొన్ని రోజుల కిందట చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్గా ఈమెను తీసుకుంటున్నట్టు జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటికీ ఆ ప్రచారం అలానే ఉంది. ఇలా ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది సాత్విక.
ఇక ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న మరో కొత్తందం అఫియా సయ్యద్. నితిన్ సరసన ‘అలియాస్ రుక్మిణీ’ అనే సినిమా చేస్తోంది అఫియా. ఈమెకిదే తొలి తెలుగు సినిమా. ఈమెకు సంబంధించి ఇప్పటివరకు రిలీజైంది కేవలం ఆమె క్యారెక్టర్ గ్లింప్స్ మాత్రమే.
ఆ వీడియోతోనే ఈమె సంచలనంగా మారింది. వీడియోలో ఆమె యూటిడ్యూట్, తాజాగా రిలీజైన సాంగ్‌లో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్లను కట్టిపడేస్తున్నాయి. పైగా సినిమాలో టైటిల్ రోల్ ఈమెదే కావడంతో అందరి చూపు ఒక్కసారిగా అఫియాపై పడింది.
ఇక రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న మరో ముద్దుగుమ్మ దేవికా భట్. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ కిరణ్ అబ్బవరం తెరకెక్కిస్తున్న రియాలిటీ అనే సినిమాలో తన సంప్రదాయ లుక్స్‌తో అందర్నీ ఆకర్షిస్తోంది దేవిక.
బెంగళూరులో పుట్టి పెరిగిన దేవిక, ఓ కన్నడ సీరియల్‌తో పాపులరైంది. ఆ తర్వాత సినిమాలు చేసింది. తెలుగులో రియాలిటీ ఆమె తొలి చిత్రం. ఈ సినిమాకు దేవిక ప్రత్యేక ఆకర్షణ అంటూ స్వయంగా కిరణ్ అబ్బవరం కితాబిస్తున్నాడు.
ఇలా తమ సినిమాలు విడుదల కాకముందే సాత్విక, దేవిక, అఫియా తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నారు. వీళ్లలో ఎవరు ఆడియన్స్‌ను మాయచేస్తారో చూడాలి.
