హీరోయిన్ పొగరుకు చిన్న నటుడు బలి

తనకంటూ కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాగ్ మయూర్. క్యారెక్టర్ నచ్చితే ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమయ్యే నటుల్లో ఇతడు కూడా ఒకడు.

ఓ మోస్తరు క్రేజ్ వచ్చిన తర్వాత, చిన్న హీరోలతో లేదా కమెడియన్లతో నటించడానికి ఇష్టపడరు హీరోయిన్లు. దశాబ్దాల కిందట వచ్చిన యమలీలలో అలీకి అదే పరిస్థితి ఎదురైంది. ఇంకా వెనక్కు వెళ్తే రాజబాబు, చలం విషయంలో కూడా అదే జరిగింది.

రోజులు మారాయి, పరిస్థితులు మారాయి అనుకోవడానికి వీల్లేదు. ఇప్పటికీ చిన్న నటులకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. గతంలో అలీకి ఎదురైన అలాంటి చేదు అనుభవమే, తాజాగా రాగ్ మయూర్ అనే చిన్న నటుడికి ఎదురైంది.

తనకంటూ కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాగ్ మయూర్. క్యారెక్టర్ నచ్చితే ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమయ్యే నటుల్లో ఇతడు కూడా ఒకడు.

ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో రాగ్ మయూర్ ను తీసుకున్నారు. సినిమాలో ఆ హీరోయిన్ కే ఎక్కువ స్కోప్. కథ మొత్తం ఆమెదే. మెయిన్ లీడ్ కూడా ఆమెదే. ఆ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ పాత్ర ఇతడిది.

అయితే తన పక్కన రాగ్ మయూర్ ను ఆమె ఊహించుకోలేకపోయింది. దర్శకుడు, నిర్మాత చెప్పినా వినలేదు. గతంలో స్టార్స్ తో చేసిన తను, ఓ చిన్న నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోనని, అతడ్ని తీసేయాలని పట్టుబట్టింది.

దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య అతడ్ని తప్పించాల్సి వచ్చింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత అదే హీరోయిన్ యాటిట్యూడ్ వల్ల ఏకంగా ఆ సినిమానే ఆపేయాల్సి వచ్చింది.