అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత త్రివిక్రమ్ కు అవకాశం ఇచ్చిన హీరో ఎన్టీఆర్. అదే విధంగా ఆదర్శ కుటుంబం ఫ్లాప్ తర్వాత కూడా త్రివిక్రమ్ కు అవకాశం ఇస్తోంది తారకే. ఇలా ఓ ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ తోనే సినిమాలు చేస్తున్నాడు త్రివిక్రమ్.
అయితే ఇవి కేవలం ఫ్లాపులు మాత్రమే కాదు, ఎన్నో వివాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్నాయి. అలాంటి కఠినమైన పరిస్థితుల మధ్య కూడా త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తున్నాడు ఎన్టీఆర్.
అజ్ఞాతవాసి విషయానికే వస్తే, ఆ సినిమా ఎన్నో విమర్శలు మూటగట్టుకుంది. ఏకంగా త్రివిక్రమ్ రైటింగ్ పై అనుమానాలు రేకెత్తించింది. కథ కూడా కాపీ కొట్టి తీశారంటూ చాలా వివాదాస్పదమైంది.
అంత రచ్చ జరిగిన తర్వాత కూడా అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్ కు అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్. ఇద్దరూ కలిసి ఓ మంచి సినిమా తీశారు.
కట్ చేస్తే, ఇప్పుడు కూడా సేమ్ సిచ్యుయేషన్. ఆదర్శ కుటుంబంపై కూడా అవే విమర్శలు. త్రివిక్రమ్ తన పెన్నులో ఇంక్ మార్చాల్సిన టైమ్ వచ్చిందంటూ సెటైర్లు. ఆయన మాటల్లో పదును తగ్గిందంటూ కామెంట్లు. చిత్తానుసారం మేకింగ్ ఉందంటూ భారీ ఆరోపణలు.
ఇప్పుడు కూడా మళ్లీ ఎన్టీఆర్ సీన్ లోకి వచ్చాడు. త్రివిక్రమ్ తో కలిసి గాడ్ ఆఫ్ వార్ మూవీకి రెడీ అవుతున్నాడు. నిజానికి ఆదర్శ కుటుంబం దెబ్బకు గాడ్ ఆఫ్ వార్ ఆగిపోయిందనుకున్నారు చాలామంది. కానీ రీసెంట్ గా ఫొటో రిలీజ్ చేసి మరీ సినిమా ఆన్ లో ఉందని చెప్పారు.
ఇలా.. త్రివిక్రమ్ ఫ్లాప్ ఎదుర్కొన్న ప్రతిసారి ఎన్టీఆర్ అతడితో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ వర్క్ పై జనాలకు సందేహాలు మొదలైన ప్రతి సందర్భంలో ఆయన పక్కన తారక్ నిలబడుతున్నాడు.
