ముచ్చ‌టేస్తున్న అల్లూరు రాజ‌కీయ నాయ‌కుల ఐక్య‌త‌

గ్రామ పంచాయ‌తీని న‌గ‌ర పంచాయ‌తీగా మార్చ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి, ఐక్య ఉద్య‌మం చేస్తున్న అల్లూరు రాజ‌కీయ నేత‌ల్ని చూస్తే ఎవ‌రికైనా ముచ్చ‌టేస్తుంది.

గ్రామ పంచాయ‌తీని న‌గ‌ర పంచాయ‌తీగా మార్చ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి, ఐక్య ఉద్య‌మం చేస్తున్న అల్లూరు రాజ‌కీయ నేత‌ల్ని చూస్తే ఎవ‌రికైనా ముచ్చ‌టేస్తుంది.

శ్రీ‌పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా కావ‌లి అసెంబ్లీ ప‌రిధిలో అల్లూరు న‌గ‌ర పంచాయ‌తీ వుంటుంది. 2020-22 మ‌ధ్య అల్లూరు, సింగపేట, నార్త్ మోపూరు గ్రామ పంచాయతీలను విలీనం చేసి న‌గ‌ర పంచాయ‌తీగా ఏర్పాటు చేశారు.

ఈ నేప‌థ్యంలో వివిధ కార‌ణాల రీత్యా నెల్లూరు జిల్లాలో కావ‌లి, గూడూరు మున్సిపాలిటీలు, అల్లూరు న‌గ‌ర పంచాయ‌తీకి మొద‌టి విడ‌త‌లో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. కోర్టులో ప‌రిష్కార‌మై, తిరిగి ఈ నెల 26న ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎస్ఈసీ నోటిఫికేష‌న్ ఇచ్చింది.

అయితే అల్లూరు న‌గ‌ర పంచాయ‌తీగా వ‌ద్దేవ‌ద్ద‌ని రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని పార్టీల నాయ‌కులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్‌ను నెర‌వేర్చుకునేందుకు రాజ‌కీయాల్ని ప‌క్క‌న పెట్టి ప్ర‌ధాన పార్టీల నాయ‌కులంతా ఉద్య‌మ బాట ప‌ట్ట‌డం ఆక‌ట్టుకుంటోంది. ఆశ‌య సాధ‌న కోసం అఖిల‌ప‌క్షంగా ఏర్ప‌డ్డారు.

ఎన్నిక‌ల్ని బ‌హిష్క‌రించాల‌ని అఖిల‌ప‌క్షం పిలుపు ఇచ్చింది. ఎవ‌రూ నామినేష‌న్లు వేయ‌కుండా ఆ కేంద్రం వ‌ద్ద నిఘా వేశారు. ఇవాళ చివ‌రి రోజు. ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ ఒక్క‌టే, ఆశ‌య సాధన మార్గంగా వారు చెబుతున్నారు. మొత్తం 23 వార్డులున్న అల్లూరు న‌గ‌ర పంచాయ‌తీకి ఇవాళ్టితో నామినేష‌న్ల గ‌డువు ముగియ‌నుంది.

స్థానిక ప్ర‌జా డిమాండ్‌ను గౌర‌వించి, అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌క‌త్వాలు కూడా జోక్యం చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రూ నామినేష‌న్లు వేయ‌క‌పోతే, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.