తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు గిరిబాబు. ఆయన నిర్మాతగా చిత్రాలు నిర్మించడమే కాకుండా, దర్శకుడిగా కూడా రాణించారు. 600కు పైగా సినిమాల్లో నటించిన దివంగత గిరిబాబుకు వైఎస్ఆర్తో , ఆయన కుమారుడు జగన్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. వారిద్దరితో గిరిబాబు రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరంగా సాగింది.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వరకు ఆయన రాజకీయ ప్రయాణం రాష్ట్ర రాజకీయ పరిణామాలకు అనుగుణంగా సాగింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఉమ్మడి ఏపీలో సరికొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. అలాంటివారిలో గిరిబాబు కూడా ఉన్నారు. ఆ తరువాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై గిరిబాబుకు ప్రత్యేక అభిమానం ఉండేది.
వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర, ప్రజలతో ఆయనకు ఏర్పడిన అనుబంధం, సంక్షేమ కార్యక్రమాలు గిరిబాబును ఆకర్షించాయి.
2009లోనే వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా నిలిచానని ఓ ఇంటర్వూలో గిరిబాబే తెలిపారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబ రాజకీయ ప్రయాణానికి గినిబాబు తన మద్దతు కొనసాగించారు. గిరిబాబు రాజకీయ జీవితంలో 2012 మే నెల కీలకమైన మలుపుగా నిలిచింది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అధికారికంగా చేరారు. 2012 మే 1న హైదరాబాద్‌లో జగన్ సమక్షంలో గిరిబాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లోనూ, రాజకీయ సమావేశాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు.
సినీ కళాకారులతో పార్టీకి మద్దతు కూడగట్టే కార్యక్రమాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. 2012 ఆగస్టులో వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ, టీవీ కళాకారులు, సాంకేతిక నిపుణుల సమావేశంలో గిరిబాబు పాల్గొన్నారు.
ఆ సందర్భంగా వైఎస్సార్‌సీపీని విజయవంతమైన రాజకీయ శక్తిగా అభివర్ణించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై బహిరంగ విమర్శలు చేశారు. వైఎస్సార్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కళాకారులకు సూచించారు.
జగన్ నాయకత్వంపై తనకు విశ్వాసం ఉందన్నారు. సినీ రంగం నుంచి మరికొందరు కూడా పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని అప్పట్లో వ్యాఖ్యానించారు. గిరిబాబును 2022లో సాక్షి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది.
ఆయన సినీ జీవితంలో 50 సంవత్సరాల ప్రస్థానం, తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించింది. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గిరిబాబు జగన్‌కు తన మద్దతును బహిరంగంగా ప్రకటించారు.
2020లో జగన్ ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా మాట్లాడుతూ, ఎన్టీఆర్ తర్వాత వైఎస్సార్, ఇప్పుడు వైఎస్ జగన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకులుగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని 15ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అప్పట్లో గిరిబాబు రాజకీయ వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. అయితే గిరిబాబు ఏ రాజకీయ పార్టీ తరపున ఎప్పుడూ పోటీ చేయలేదు.
గిరిబాబుతో తమ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు. “నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యుడైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించిందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు.
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జగన్.

Good sir
అదే అన్మి ఆర్టికల్స్ రాసి అంత ఎలివేషన్ ఇచ్చి నేను రాసే రాతలు తీసేస్తేనే డౌట్ వచ్చింది ఈ ఆర్టికల్ ఎప్పుడా అని..
ఇంకా కృష్ణ కి దగ్గిర, అయిన మాట మీద గురి ఇలా ఇంకా రాయి. Ofcourse those are facts.
..
ఏ మకిలి అంటని ధవళదారి గుమ్మడి. ఆయన ముఖంలో శాంతం నేను ప్రత్యక్షంగా చూసిన ఏ ఆర్టిస్ట్ కి లేదు. వైట్ శాంత్రో కారులో మెరిసేవారు..
పోయినోళ్లకి మకిలి అంటించడం ఎందుకు. పార్టీలకి అతీతంగా ప్రేమించేవారు ద్వేషించడం మొదలెడతారు.
గిరిబాబు ఎప్పుడు చెప్పలేదే !!