ఆకాశంలో ఒక తార… 2 రోజులుగా ట్రెండింగ్ అవుతున్న సినిమా పేరు. నిజానికి దీన్ని ట్రెండింగ్ చేస్తోంది, సినిమాపై ఇష్టంతో పాటు, ఈ సినిమా ప్రచారానికి అల్లు అర్జున్ వస్తున్నాడని. దీనికి కూడా ఓ కారణం ఉంది.
చాన్నాళ్లుగా ‘రాకా’ సినిమా పనిలో ఉన్నాడు బన్నీ. ఎప్పట్నుంచో ఈ సినిమా నుంచి అప్ డేట్ కోసం అతడి అభిమానులు వెయిటింగ్. ఈరోజు జరిగిన ఆకాశంలో ఒక తార ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వేదికగా రాకా అప్ డేట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు.
దీనికి సంబంధించి 2 రోజులుగా చాలా ప్రచారం నడిచింది. టీజర్ రిలీజ్ డేట్ ఇస్తారని కొందరు, గ్లింప్స్ వస్తుందని మరికొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. కానీ బన్నీ మాత్రం అభిమానుల ఆశలపై నీళ్లుచల్లాడు.
రాకా సినిమా గురించి మాట్లాడ్డానికి అస్సలు ఇష్టపడలేదు అల్లు అర్జున్. అప్ డేట్ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం అంచనాలు పెంచేలా కూడా మాట్లాడలేదు. ఏదో ఒక అప్ డేట్ త్వరలోనే ఇస్తామంటూ ముక్తసరిగా చెప్పి ముగించాడు. దీంతో అల్లు అర్మీ హర్ట్ అయింది.
రాకా అప్ డేట్ ఇవ్వడం లేట్ అవుతుందనే విషయం తనకు తెలుసన్నాడు బన్నీ. అయితే ఇచ్చేదేదో బెస్ట్ ఇద్దామని, రిలీజ్ చేసిన తర్వాత చర్చలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతో ఉన్నామని అన్నాడు.
ఏదేమైనా రాకా నుంచి ఇప్పట్లో అప్ డేట్ రాదని చెప్పేకనే చెప్పేశాడు అల్లు అర్జున్. అంతా ఓపిగ్గా ఉండాలని కూడా విజ్ఞప్తి చేశాడు. సో.. రాకా అప్ డేట్ ఇచ్చే మూడ్ లో యూనిట్ లేదనే విషయం తెలుస్తూనే ఉంది.

అల్లు అర్జున్ గారు ధియేటర్ ఇన్సిడెంట్ తో అప్పటి వరకు గడించిన పేరు ప్రఖ్యాతలు అన్ని పోగొట్టు కొన్నారు. కామన్ మ్యాన్ ఎవరు ఇంతకు ముందు లా ఎవరు గుర్తించరు. ఇప్పటికైనా నెల మీదకు వొచ్చి నేను సమాజం లో ఒక మనిషి అని అనుకోని ప్రవర్తిస్తే బాగుంటుంది.
చెప్పను బ్రదర్