ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన నరసింహ క్షేత్రం శ్రీ సింహాచల స్వామివారి ఆలయంలో అధికారుల స్థాయిలోనే ఒక పెద్ద తప్పిదం జరిగిందని ఆధ్యాత్మిక పరులు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి కల్యాణానికి ఉపయోగించే వేదిక ప్రాంతాన్ని జనసామాన్యుల కల్యాణాల వేదికగా మార్చడం పట్ల మండిపడుతున్నారు.
స్వామివారికి ఏటా వార్షిక కల్యాణోత్సవాలు జరిగే అతి పవిత్రమైన ప్రాంగణం నృసింహ మండపంలో కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.54 కోట్ల నిధులతో యాంఫీ థియేటర్‌ను పర్యాటక శాఖ నిర్మించింది.
ఈ ప్రాంగణాన్ని స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగిస్తారని అనుకుంటే, అనూహ్యంగా దేవస్థానం అధికారులు ఆ ప్రాంగణంలో ప్రైవేట్ వ్యక్తుల వివాహాలకు తాజాగా అనుమతించారు.
దాంతో ఇలా ఎలా అనుమతులు ఇస్తారని భక్తులు మండిపడుతున్నారు. ఇదేం దుర్విధానమని ప్రశ్నిస్తున్నారు.
స్వామివారి పవిత్ర కల్యాణోత్సవాలు జరిగే ప్రాంగణంలో బయట వ్యక్తుల వివాహాలకు అనుమతినివ్వడం అతి పెద్ద అపచారమని భక్తులు విమర్శిస్తున్నారు. ఆధ్యాత్మిక పరులు సైతం ఈ పద్ధతిని తప్పుపడుతున్నారు. అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని వాదిస్తున్నారు.
ఇలా ఈ రోజున పెళ్లిళ్లు, పేరంటాలకు పవిత్ర ప్రాంగణాన్ని వినియోగిస్తారని, రేపటి రోజున ఇదే తీరు కొనసాగితే స్వామివారి ఆధ్యాత్మిక ప్రాంగణం వైభవం, పవిత్రత ఏమవుతాయని ఆస్తిక జనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్వామివారి ఆలయంలో నిర్మించిన కళా వేదికను ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేదికగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతేనా? నేనేమో మావోడు తాడేపల్లి ప్యాలెస్ లో అప్పన్న స్వామి గుడి సెట్టింగ్ యేసాడేమో అనుకున్నా..!
మావోడు దేవుడికోసం గుడికి వెళ్ళడు… ప్యాలెస్ లో గుడి సెట్టింగ్ ఎసి, ఆ దేవుడినే మావోడి దగ్గరికి తప్పించుకునే సత్తా సొంతం తెల్సా?
శ్రీ వాణి ద్వారా మా ఊరిలో వేణుగోపాలస్వామి దేవాలయం పునర్నిర్మాణం జగన్ ప్రభుత్వం చేసింది •30 లక్షలు టిటిడి విరాళం ఇచ్చింది •
GeorgeReddy దగ్గరికి తప్పించుకునే సత్తా సొంతం తెల్సా?