ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా విశాఖ ఆంధ్రుల మహానగరం. అలాగే రాజధానిగా కూడా అనధికారికంగా కొనసాగుతున్న నగరమని అంతా అంటున్నారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలో ఏ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించాలన్నా విశాఖనే వేదికగా ప్రభుత్వం ఎంచుకుంటోంది. అది టీడీపీ అయినా, వైసీపీ అయినా విశాఖలోనే భారీ ఎత్తున సదస్సులు, సమ్మిట్లు జరుగుతాయి.
విశాఖకు ఆ హోదా, గౌరవం ఉన్నాయి కాబట్టే రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఈ ఎంపిక జరుగుతోందని అంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ పెద్దలు విశాఖను రాజధానిగా చేస్తామని చెబుతూ వచ్చారు.
మూడు రాజధానుల్లో విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ప్రధాన స్థానంలో ఉంటుందని ప్రకటించారు. అయితే ఆచరణలో అది నోచుకోలేదు. ఆనాడు టీడీపీ దానిని వ్యతిరేకించింది.
ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టాక అమరావతిని ఏకైక రాజధానిగా చేస్తూ పార్లమెంట్‌లో తీర్మానం చేయించింది. అంతవరకు బాగానే ఉన్నా, అమరావతి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. దాంతో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా విశాఖనే కూటమి ప్రభుత్వం కూడా ఎంచుకుంటోంది.
తాజాగా జరిగిన 31వ సీఐఐ సమ్మిట్‌కు కూడా విశాఖ ఆతిథ్యం ఇచ్చి శభాష్ అనిపించుకుంది. విశాఖకు వచ్చిన దాదాపు అరవై దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు నగర అందాలను చూసి పరవశించారు. విశాఖను ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ అంటూ కితాబిచ్చారు.
విశాఖ అనుకూలమైన నగరం అనడానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ సీ పోర్టు, ఎయిర్‌పోర్టు, రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరంగా విశాఖ గుర్తింపు పొందింది.
అతిథులు బస చేసేందుకు ఫైవ్‌స్టార్ హోటళ్లు ఉన్నాయి. అందుకే విశాఖలో ఏ కార్యక్రమం నిర్వహించినా రవాణా పరంగా, ఆతిథ్యం పరంగా కూడా ఇబ్బందులు ఉండవు.
ఈ కారణాల చేతనే విశాఖ అంతర్జాతీయ సెమినార్లకు వేదిక అవుతోంది. అది విశాఖ ప్రజలకు కూడా గర్వకారణంగా ఉంటోంది. విశాఖను రాజధాని అని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే సహజసిద్ధంగానే ఆ రాజసం విశాఖ నగరానికి ఉందని అంటున్నారు. వైజాగ్ ఆల్వేస్ గ్రేట్ అని కూడా అంటున్నారు.

అలా అంటున్నారు కాబట్టే…మాకు రాజధాని అవసరం లేదు….మీ దోపిడి కి బలి కానవసరం లేదు…అని మనకి గుండు కొట్టారు
అధ్సరే.. వైజాగ్ రుషికొండ ప్యాలెస్లో మనోడి కాపురం ఎప్పట్నుండీ?..
కాపురం సజ్జలతోనా “లేక PK తోనా?
నువ్వు మాత్రం కు. క కన్నా హీనం. అవి సిగ్గు పడతా యి..నీతో పోల్చి నందుకు
Vizag is a great city.
pe0ple d0nt need y0ur certificate .
we kn0w why you are praising vizag.
we still need a greenfield capital AMARAVATHI.
ఒక కొలంబస్….
ఒక వాస్కోడిగామ…
లాగ అన్నియ వైజాగ్ ని కనుక్కున్నాడు… అన్నట్టు
అన్నయ లాగా ఏది కట్టకుండా వదిలేయకుండా ఎక్కడో అక్కడ కడుతున్నారు అవకాశం వున్నా చోట ప్రయత్నిస్తున్నారు కేసులు బైళ్ల కు ఎంపీ లను తాకట్టు పెట్టడం లేదు ముందర పార్టీ ప్రయోజనాలు రాష్ట్రప్రయోజనాలు చూసుకొంటున్నారు సంతోషం పోలవరం పూర్తి అవుతుంది తుపాను దెబ్బకు పాడైన రోడ్ లు బాగుచేయాలి మా గోదావరి జిల్లాలకు బ్రిటిష్ వాళ్ళు వేసినవి తప్ప ఏమి రాలేదు కాకినాడ నర్సాపూర్ రైల్ మార్గం పూర్తి చేయాలి పోలవరం మీద వచ్చి కొత్త ఆయకట్టు కేవలం పామ్ ఆయిల్ వేయించాలి వరి ధాన్యం తో పడలేకపోతున్నాం