వైఎస్సార్ సన్నిహితుడు మృతి

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌న్నిహితుడు, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయకుడు షేక్ హుస్సేన్ అనారోగ్యంతో క‌న్నుమూశారు.

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌న్నిహితుడు, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయకుడు షేక్ హుస్సేన్ అనారోగ్యంతో క‌న్నుమూశారు.

కాంగ్రెస్ పార్టీ క‌డ‌ప జిల్లా అధ్య‌క్షుడిగా ప‌దేళ్ల‌కు పైగా ప‌ని చేసిన ఘ‌న‌త ఆయ‌నకే ద‌క్కింది. అలాగే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొట్ట‌మొద‌టి ముస్లిం మైనార్టీ క‌థా ర‌చ‌యిత‌గా ఆయ‌న‌కు గుర్తింపు, గౌర‌వం ఉన్నాయి.

సాహిత్యంలో ఆయ‌న త‌ల‌పండిన వ్య‌క్తి. షేక్ హుస్సేన్ క‌లం పేరు స‌త్యాగ్ని. 1980 ద‌శ‌కంలోనే ఆయ‌న ముస్లిం మైనార్టీల స‌మస్య‌ల‌పై అద్భుత‌మైన క‌థ‌లు రాశారు.

ముస్లిం మైనార్టీల అస్తిత్వ సాహిత్యానికి పునాది వేసిన ర‌చ‌యిత‌గా స‌త్యాగ్నికి పేరు వుంది. తెలుగు భాష‌పై ఆయ‌న‌కు అద్భుత‌మైన ప‌ట్టు వుంది. అందుకే మంచి వ‌క్త‌గా పేరు సంపాదించారు.

రాజ‌కీయంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత స‌న్నిహితంగా మెలిగారు. అందుకే త‌న సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ద‌శాబ్ద కాలానికి పైగా షేక్ హుస్సేన్‌ను కొన‌సాగించారంటే, ఎంత న‌మ్మ‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు.

2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, రాష్ట్ర అట‌వీ అభివృద్ధి సంస్థ చైర్మ‌న్‌గా షేక్ హుస్సేన్‌ను వైఎస్సార్ నియ‌మించారు.

వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌ప‌డింది. అయితే కాంగ్రెస్‌లోనే షేక్ హుస్సేన్ కొన‌సాగారు. వ‌య‌సు పైబ‌డ‌డంతో రాజ‌కీయాల‌కు క్ర‌మంగా దూర‌మ‌య్యారు.

కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో మంచం ప‌ట్టారు. ఇవాళ చివ‌రి శ్వాస విడిచారు. స‌త్యాగ్ని మృతిపై రాజ‌కీయ , సాహితీ ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు.

6 Replies to “వైఎస్సార్ సన్నిహితుడు మృతి”

  1. అంటే కేవీపీ, ఉండవల్లి, సాయి ప్రతాప్ దగ్గరికి నుండి హుస్సేన్ వరకు YSR సన్నిహితులు ఎవరు అన్న ను దేకలేదు అని అర్థం అవుతుంది….చివరికి సూరీడు కూడా

  2. ఓహ్…అన్న సంగతి అందరికి తెలిసి మహా మేత సన్నిహితులు ఎవరు దగ్గరి కి రానివ్వలేదు

  3. నాకెందుకో లిక్కర్ స్కాం తెరపైకి వస్తుందంటే జగనన్న జైల్ వైబ్స్ తెలుస్తున్నాయ్

    రెండో సారి జగనన్న త్వరలో జైలు జీవితం అనుభవిస్తాడు అనిపిస్తుంది

    పాదయాత్రకు ముందు ఎత్తుతారేమో!

  4. నాకెందుకో లిక్కర్ స్కాం తెరపైకి వస్తుందంటే జగనన్న  జై ల్ వైబ్స్ తెలుస్తున్నాయ్

    రెండో సారి జగనన్న త్వరలో జై లు జీవితం అనుభవిస్తాడు అనిపిస్తుంది

    పాదయాత్రకు ముందు ఎత్తుతారేమో!

Comments are closed.