లోక్‌సభ సీట్ల పెంపుపై మోదీ సర్కార్ పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో మహిళలకు రిజర్వేషన్ బిల్లు సాకుతో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
ఇందులో భాగంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్ని డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని ఎన్డీఏ సర్కార్ నిర్ణయించింది. అయితే ఎప్పుడు నిర్వహించాలనే విషయమై తేదీలను ఖరారు చేయాల్సి వుంది.
డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలనే ఎన్డీఏ సర్కార్ పంతంపై ఇండియా కూటమి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ఎందుకంత ఆత్రుత అని ఇండియా కూటమి ప్రశ్నిస్తోంది.
నిజంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే సదాశయం వుంటే, ఇప్పుడున్న సీట్లలోనే వారికి 33 శాతం ఇవ్వొచ్చు కదా? అని ఇండియా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి మాత్రం ఎన్డీఏ నేతల వద్ద సరైన సమాధానం లేదు.
ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. అయితే డీలిమిటేషన్‌కు మహిళా రిజర్వేషన్ బిల్లును లింక్ పెట్టి, సవరణ పేరుతో ఎన్డీఏ సరికొత్త గేమ్‌కు శ్రీకారం చుట్టింది.
ఈ విషయంలో ఎన్డీఏ ఆటలు కుదరవని ఇండియా కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన ఈ బిల్లులు, మూడింట రెండొంతల మద్దతు లేక వీగిపోయిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి ఎన్డీఏ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎన్డీఏ సర్కార్ 12 ఏళ్ల పాలనలో మొదటిసారి ఎదురు దెబ్బతింది. గతంలో ఏ బిల్లు తీసుకొచ్చినా ఆమోదించుకనేది. కానీ మొదటి సారి అత్యంత ప్రాధాన్యం కలిగిన రెండు బిల్లుల్ని తీసుకురాగా, కావాల్సినంత మెజార్టీ కూడగట్ట లేక చతికల పడింది.
ప్రస్తుతం లోక్‌సభకు 543 మంది సభ్యుల్ని ఎన్నుకునే సౌలభ్యం వుంది. ఈ సంఖ్యను 850కి పెంచాలనేది ఎన్డీఏ ఉద్దేశం. ఇదే రీతిలో రాష్ట్రాల్లోని శాసనసభ సీట్ల సంఖ్య కూడా పెరుగుతాయి.
జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రతి రాష్ట్రంలో 50 శాతం చొప్పున సీట్లు పెంచుతామని ఎన్డీఏ చెబుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు నమ్మడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్థితి. ఎన్డీఏకు సంపూర్ణ మద్దతు ఇచ్చే రాష్ట్రం ఏదైనా వుందంటే … అది ఆంధ్రప్రదేశే.
ప్రస్తుతం లోక్‌సభలో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. 540లో మూడింట రెండొంతల బలం అంటే 360 మంది చొప్పున మద్దతు పలకాల్సి వుంటుంది. ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ బలం 320 మాత్రమే. ఈ దఫా మద్దతు కూడగడుతామని ధీమాలో బీజేపీ అగ్రనేతలున్నారు. కానీ లోక్‌సభ సమావేశాలు సవ్యంగా సాగే పరిస్థితి కనిపించడం లేదు.
సర్ ప్రక్రియ పేరుతో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ బీజేపీ వ్యతిరేక ఓటర్లను భారీగా తొలగిస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి నేతలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ అనుకున్నట్టుగా రెండు కీలక బిల్లులు తీసుకురావాలని భావించినా, అంత ఈజీ కాదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ తీసుకొచ్చినా, పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం ఖాయమని చెప్పక తప్పదు.

eesari Jagan kuda hand istaadule modi