స్థానిక పోరులో మోస‌గించారా.. జ‌గ‌న్ ఆరా!

వైఎస్ జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఏక‌గ్రీవాలు కాకూడ‌ద‌ని హెచ్చ‌రించ‌డంతో ఎంత‌కైనా మంచిద‌ని ఇన్‌చార్జ్‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌న పార్టీ నాయ‌కుల ప‌నితీరుపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. మున్సిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాంతాల్లో ఆ పార్టీ మంచి ఫ‌లితాల్ని సాధించింది.

సీరియ‌స్‌గా తీసుకోని ప్రాంతాల్లో మాత్రం … చెప్పుకోద‌గ్గ స్థాయిలో వైసీపీ అభ్య‌ర్థులు ఓట‌మిని మూట‌క‌ట్టుకున్నారు. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్‌కు ఫిర్యాదులు వెళ్లిన‌ట్టు స‌మాచారం.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై ముఖ్య నేత‌ల‌పై వైఎస్ జ‌గ‌న్ ప‌లు ద‌ఫాలు స‌మావేశాలు నిర్వ‌హించారు. ఇవి కార్య‌క‌ర్త‌లు, గ్రామస్థాయి నాయ‌కుల‌కు సంబంధించిన ఎన్నిక‌ల‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌చ్చారు.

ఈ ఎన్నిక‌ల్లో వారికి అండ‌గా నిల‌వాల‌ని, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వాళ్లంతా మీకు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని వైసీపీ స‌మన్వ‌య‌క‌ర్త‌ల‌కు ప‌దేప‌దే హితోప‌దేశం చేశారు. కానీ అత్య‌ధిక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్ జ‌గ‌న్ ఆదేశాల్ని ఇన్‌చార్జ్‌లు ప‌ట్టించుకోలేదు.

స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో “మీ చావు మీరు చావండి” అన్న‌ట్టుగా వైసీపీ ఇన్‌చార్జ్‌లు వ‌దిలేశారు. కేవ‌లం నామినేష‌న్లు వేయించ‌డం వ‌ర‌కే త‌మ బాధ్య‌త అన్న‌ట్టు వైసీపీ ఇన్‌చార్జ్‌లు వ్య‌వ‌హ‌రించారు.

అదైనా వైఎస్ జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఏక‌గ్రీవాలు కాకూడ‌ద‌ని హెచ్చ‌రించ‌డంతో ఎంత‌కైనా మంచిద‌ని ఇన్‌చార్జ్‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

వైసీపీ హ‌యాంలో కార్య‌క‌ర్త‌లు న‌ష్ట‌పోయారు. క‌నీస ఆదాయానికి కూడా నోచుకోక‌పోవ‌డంతో గ్రామ‌స్థాయి వైసీపీ నాయ‌కులకు ఆర్థిక ఇబ్బందులు త‌ప్ప‌లేదు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మి నేత‌ల‌తో ఢీకొనాలంటే ఆర్థిక వ‌న‌రులు అవ‌స‌రం. అయితే ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డం, వారికి వెన్నుద‌న్నుగా నిలిచే పెద్ద మ‌న‌సు వైసీపీ ఇన్‌చార్జ్‌ల‌కు లేక‌పోవ‌డం ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

ఇంత‌టి అరాచ‌కాల్లోనూ వైసీపీ అనూహ్యంగా మంచి ఫ‌లితాల్ని సాధించింది. ఆర్థికంగా పెద్ద‌గా ఖ‌ర్చు చేసిన దాఖ‌లాలు కూడా లేవు. వైసీపీ ఇన్‌చార్జ్‌లు కొద్దోగొప్పో ఎన్నిక‌ల ఖ‌ర్చులు పెట్టుకున్న చోట మాత్రం, ఆ పార్టీ మెరుగైనా ఫ‌లితాల్ని సాధించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే వైసీపీ ఇన్‌చార్జ్‌లు ఎన్నిక‌ల్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు వైఎస్ జ‌గ‌న్‌కు నివేదిక‌లు వెళ్లిన‌ట్టు స‌మాచారం.

వైసీపీ ఇన్‌చార్జ్‌లు సీరియ‌స్‌గా తీసుకోక‌పోవ‌డం, అలాగే టీడీపీ అరాచ‌కాలు వెర‌సి… వైసీపీ కొన్ని జిల్లాల్లో క‌నీస సీట్లు కూడా సాధించ‌న‌ట్టు వైఎస్ జ‌గ‌న్‌కు ఫిర్యాదులు వెళ్లిన‌ట్టు పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. దీంతో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా నాయ‌కుల ప‌నితీరుపై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నార‌ని స‌మాచారం.

ఎన్నిక‌ల్లో ఎవ‌రెలా చేశారో త‌న‌కు తెలియ‌ద‌ని అనుకుంటూ, మోస‌గించార‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఎన్నిక‌ల్లో బ‌ల‌హీన‌మైన ఫ‌లితాల్ని సాధించిన వారిపై రానున్న రోజుల్లో జ‌గ‌న్ త‌గిన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

7 Replies to “స్థానిక పోరులో మోస‌గించారా.. జ‌గ‌న్ ఆరా!”

  1. కొజ్జామోహనరెడ్డి సొంత ఊర్లో కూటమికి ఎదురు నిలబడి, కలబడి షర్ట్ మడిచి, ఎంతమందొస్తారో రండి అంటూ సవాళ్లు చేసి,కూటమి ని కొడితే..

    రాష్ట్రం మొత్తం re-sound వచ్చింది కదా? ఇక స్థానిక నాయకులకు మోసం చెయ్యడానికి అవకాశం ఎక్కడ?

  2. మా “షింగిల్ షింహం” షర్ట్ మడతేసి సవాళ్లు చేస్తే,సొంత ఊర్లో మోకాళ్ళు మడిచి నడిరోడ్డులో వొంగోబెట్టారు కదయ్యా.. ఇది న్యాయమా?

  3. రాష్ట్రంలో అక్కడక్కడ, స్థానిక నాయకుల బలంతో గెలిచిన స్థానాలు తన వల్లే గెలిచాం అని క్రెడిట్ చోరీ చేసిన కొజ్జామోహనరెడ్డి..

    మరి ఓడిపోయిన 94%స్థానాల్లో స్థానిక నాయకులు మోసం చేసి పార్టీని ఓడించారు అంటూ వాళ్ళని అవమానపరచడం న్యాయమా?

  4. అదేంది…నిన్నటి దాకా YCP కి స్థానిక ఎన్నిక లో మెరుగైన ఫలితాలు, అన్న తోపు క్యాడర్ ఊపు, అన్న దెబ్బ కూటమి అబ్బ అని డైలాగ్ వదిలావ్…ఇప్పుడు అన్న మోసపోయాడు అంటున్నావ్

  5. అదేంది…నిన్నటి దాకా YCP కి స్థానిక ఎన్నిక లో మెరుగైన ఫలితాలు, అన్న తో*పు క్యాడర్ ఊ”పు, అన్న దె*బ్బ కూటమి అ’బ్బ అని డైలాగ్ వదిలావ్…ఇప్పుడు అన్న మోసపోయాడు అంటున్నావ్

Comments are closed.