ఇటు రూ.800 కోట్లు.. అటు బెయిల్

అల్లు అర్జున్ కు ఒకేసారి 2 సంతోషాలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అతడికి రెగ్యులర్ బెయిల్ దక్కింది.

అల్లు అర్జున్ కు ఒకేసారి 2 సంతోషాలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అతడికి రెగ్యులర్ బెయిల్ దక్కింది. మరోవైపు అతడు నటించిన పుష్ప-2 హిందీ వెర్షన్ ఏకంగా 800 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటరైంది.

మధ్యంతర బెయిల్ నుంచి రెగ్యులర్ బెయిల్..

పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను ఏ-11 నిందితుడిగా చేర్చారు.

బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అదే టైమ్ లో హైకోర్టుకు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అయినప్పటికీ అతడు ఒక రాత్రి జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

అలా మధ్యంత బెయిల్ పై బయటకొచ్చిన అల్లు అర్జున్ కు, నాంపల్లి కోర్డులో ఈరోజు రెగ్యులర్ బెయిల్ దొరికింది. బన్నీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 50వేల రూపాయల విలువైన 2 పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు, సాధారణంగా రెగ్యులర్ బెయిల్ పై విధించే షరతులన్నింటినీ అల్లు అర్జున్ కు విధించింది.

రెగ్యులర్ బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్, సాక్ష్యుల్ని ప్రభావితం చేయకూడదు. కేసును ప్రభావితం చేసేలా బహిరంగంగా మాట్లాడకూడదు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలి. ఈ షరతులతో అతడికి బెయిల్ వచ్చింది.

రూ.800 కోట్ల ఆనందం..

మరోవైపు పుష్ప-2 సినిమా బన్నీకి ఓ అరుదైన, ఘనమైన రికార్డును కట్టబెట్టింది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఏకంగా 800 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ వసూళ్లు 798 కోట్ల రూపాయలు. ఇటు బెయిల్ వచ్చే సమయానికి, అటు ఈ సినిమా 800 కోట్ల నెట్ వసూళ్లు కచ్చితంగా కలెక్ట్ చేసి ఉంటుంది.

ఇండియాలో ఈ ఘనత సాధించిన హీరో మరొకరు లేరు. బన్నీ మాత్రమే ఈ క్లబ్ ను క్రియేట్ చేశాడు. సరిగ్గా విడుదలైన నెల రోజులకు పుష్ప-2 ఈ ఘనత సాధించింది.

13 Replies to “ఇటు రూ.800 కోట్లు.. అటు బెయిల్”

  1. All India Super Star Allu Arjun. Hearty congratulations. Continue your glorious journey as a super star. There are few people and media with unbearable jealous and unreasonable hatred on you. All euch people are rotten with caste and political affiliations. But, national media recognized your talent.

Comments are closed.