ముఖ్యమంత్రి అన్న తర్వాత పార్టీ మీద పట్టు ఉండాలి. ప్రభుత్వం మీద పట్టు ఉండాలి. లేకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అరాచకంగా వ్యవహరిస్తారు. ఇతర పార్టీల సంగతి అలా ఉంచితే కాంగ్రెస్ పార్టీలో ఈ ధోరణులు ఎక్కువ. అందుకే రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
అందుకే కొత్త సంవత్సరం సందర్భంగా తాను మారానని మీరు కూడా మారాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పారు. మొదటి ఏడాదితో అందరికీ హనీమూన్ పీరియడ్ ముగిసింది. మొదటి ఏడాది మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు.
ప్రభుత్వ ఇంటలిజెన్స్ వర్గాలు, రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం సర్వే చేశాయి. తన పనితీరు మీద కూడా సర్వే చేయించుకున్నట్లు రేవంత్ చెప్పారు. ఆయన చేయించిన సర్వేలో ఇద్దరు మంత్రుల, ఇరవై మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదట.
ఆ మంత్రులు ఎవరో, ఎమ్మెల్యేలు ఎవరో పేర్లు బయటకు రాలేదు. మంత్రివర్గంలోని మంత్రులంతా దాదాపు సీనియర్లే. గతంలో చాలాకాలం మంత్రులుగా పని చేసినవారే. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు కూడా బాగా సీనియర్ మంత్రి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడా మంత్రిగా పని చేయలేదు.
పనితీరు బాగాలేని ఆ ఇద్దరు మంత్రులు ఎవరోగానీ వారిద్దరి పేర్లు బయటపడకపోవచ్చు. ఇరవై మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటే వారు వారి నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా లేరని అర్థం. ప్రజలతో సంబంధాలు పెట్టుకోకపోవడం, పార్టీని బలోపేతం చేయకపోవడం, ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయకపోవడం మొదలైనవి. పనితీరు బాగాలేనివారికి వారికి సంబంధించిన రిపోర్టులు సీల్డ్ కవర్లో వారికి మాత్రమే అందజేస్తారట.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పనితీరు బాగాలేనివారి భోజనానికి పిలిచి రిపోర్టులు అందించేవారట. తాను కూడా ఇలాగే చేయాలని రేవంత్ అనుకుంటున్నట్లు సమాచారం. వారి పనితీరును బట్టే పదవులు, ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడమనేది ఉంటుంది.
In one year 20 MLAs are inefficient. It means.. in another one / two years, how many ?
అయ్యా రావు గారు, 20 మంది పనితీరు బాగా లేదు అంటే మిగతా వాళ్ళ పనితీరు బాగుందని అర్థం, ఆ 20 మందిలో కొందరైనా తమ పనితీరు మెరుగు పరుచుకొంటారు
పని తీరు బాగొలెదు అనె జగన్ అంత మంది మంత్రులని మార్చారా?