తిమింగలాన్ని వదిలేసి చిన్న చేపపై వేటు!

పదేళ్లుగా ఆమె వద్ద సేవలందిస్తున్న పీఏ చేస్తున్న అవినీతి కేవలం అతనికే పరిమితమా?

ఒక వ్యక్తి ఒక నాయకురాలి వద్ద పదేళ్లుగా వ్యక్తిగత పీఏగా పనిచేస్తున్నారు. కాలం కలిసి వచ్చి ఆ నాయకురాలి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆమెకు పెద్ద పదవి కూడా దక్కింది. ఆ పదవిని అడ్డు పెట్టుకుని సదరు పీఏ విపరీతమైన అవినీతికి, అరాచకాలకు పాల్పడుతున్నాడని భ్రష్టు పట్టిపోయేంత స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఆ పీఏ మీద వేటు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా నిండా ఏడునెలలు కూడా గడవలేదు. అప్పుడే ఒక మంత్రి పీఏ అరాచకాన్ని ప్రభుత్వ పెద్దలే భరించలేక వేటు వేస్తే తప్ప పరువు దక్కదని భయపడేంత తీవ్ర దోపిడీ జరిగిందన్నమాట.

అయితే, ఇక్కడ సామాన్యులకు కలుగుతున్న సందేహం ఒక్కటే. పీఏ మీద వేటు వేస్తే అవినీతి ఆగుతుందా? అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందా? సదరు మంత్రికి తెలియకుండా పీఏ ఏకపక్షంగా అవినీతికి పాల్పడడం సాధ్యమేనా? పీఏను కేవలం బలిపశువును చేయడమే కదా? చిన్న చేపపై వేటు పడినంత మాత్రాన తిమింగలాల స్వాహాపర్వం ఆగుతుందా?

అవును—ఇదంతా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జమానాలో సాగుతున్న దోపిడీ పర్వం గురించే. మంత్రి అనిత వద్ద ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్న సంధు జగదీష్‌పై వేటు పడింది. అవినీతి ఆరోపణలు మిన్నంటడంతో వేటు వేసినట్టుగా తెలుస్తోంది. వేటు వేసిన సంగతిని మంత్రి స్వయంగా ఇటీవల పాయకరావుపేట పార్టీ కార్యకర్తల సమావేశంలోనే తెలియజెప్పడం విశేషం. తన శాఖలో పెచ్చరిల్లిన అవినీతి కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడంతో, తనను తాను కాపాడుకోవడానికి ప్రైవేట్ పీఏ సంధు జగదీష్‌పై వేటు వేసినట్టుగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు.

పదేళ్లుగా ఆమె వద్ద సేవలందిస్తున్న పీఏ చేస్తున్న అవినీతి కేవలం అతనికే పరిమితమా? మంత్రికి తెలియకుండా ఆమె పాత్రగానీ, మార్గదర్శనంగానీ లేకుండా పీఏ అవినీతి చేయడం సాధ్యమేనా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.

పదేళ్లనాటి ప్రైవేట్ పీఏపై వేటు వేయడం కేవలం ఒక కంటితుడుపు డ్రామా మాత్రమేనని, ముందుముందు మళ్లీ అతని హవానే నడుస్తుందని సొంత పార్టీలోనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మంత్రి వంగలపూడి ప్రైవేట్ పీఏ జగదీష్ ఆమెతో పనుల నిమిత్తం వచ్చే ప్రతి ఒక్కరినుంచి భారీస్థాయిలో వసూళ్లకు పాల్పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె అండదండలతోనే అన్ని అరాచకాలు జరుగుతున్నట్టు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఎట్టకేలకు వేటు పడింది.

అయితే, అవినీతి, అరాచకాలు చేస్తున్నట్టు స్పష్టమైన తర్వాత కూడా కేవలం వేటు వేయడం ప్రభుత్వ కఠిన చర్యగా నమ్మాలి అనే అభిప్రాయంతో ప్రజలు విస్తుపోతున్నారు. తప్పు చేసిన వ్యక్తిపై కేసులు పెట్టించి, పోలీసు విచారణ జరిపించాలి. హోం మంత్రికి పదేళ్లుగా సేవలందిస్తున్న వ్యక్తి ఆమె ఆదేశాల మేరకు చేసిన అవినీతి కేసుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థతో జగదీష్‌ను విచారిస్తే, ఈ ఏడునెలల కాలంలో ఎంత భారీ అవినీతికి పాల్పడ్డాడో, అందులో స్వయంగా మంత్రిపాత్ర ఎంత ఉందో బయటకు వస్తుందని పలువురు అంటున్నారు.

అలాంటి చర్యలు తీసుకోకుండా, కేవలం వేటు వేసి చేతులు దులుపుకుంటే, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు నమ్మడం కష్టం.

22 Replies to “తిమింగలాన్ని వదిలేసి చిన్న చేపపై వేటు!”

  1. అవునా.. మరి సజ్జల రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి.. పెద్ది రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి.. సాయి రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి..

    ఈ అవినీతి దందా జగన్ రెడ్డి కి తెలియకుండానే జరిగిందా..?

    కానీ.. జగన్ రెడ్డి మాత్రం కడిగిన ముత్యం .. అసలు ఆయన నోట్లో వేలు పెట్టినా చీకలేడు అంటూ జగన్ రెడ్డి ని వెనకేసుకొచ్చిన తమరికి.. వాళ్ళ మీద వేటు వేయకపోతే.. ప్రజలు జగన్ రెడ్డి అతి నిజాయితీ.. అతి మంచితనాన్ని శంకిస్తారని అనిపించలేదా..?

    ..

    ఇప్పుడు 7 నెలలకే పోలీసు విచారణ చేయించాలని అడుగుతున్న తమరికి.. మహామేత కాలం నుండి చేసిన అవినీతి పైన విచారణ జరుపుతుంటే.. జగన్ రెడ్డి మీద కక్ష అంటూ ఏడుస్తావెందుకు ?

  2. అవునా.. మరి సజ్జల రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి.. పెద్ది రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి.. సాయి రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి..

    ఈ అవినీతి దందా జగన్ రెడ్డి కి తెలియకుండానే జరిగిందా..?

    కానీ.. జగన్ రెడ్డి మాత్రం కడిగిన ముత్యం .. అసలు ఆయన నోట్లో వేలు పెట్టినా చీకలేడు అంటూ జగన్ రెడ్డి ని వెనకేసుకొచ్చిన తమరికి.. వాళ్ళ మీద వేటు వేయకపోతే.. ప్రజలు జగన్ రెడ్డి అతి నిజాయితీ.. అతి మంచితనాన్ని శంకిస్తారని అనిపించలేదా..?

    ..

    ఇప్పుడు 7 నెలలకే పోలీసు విచారణ చేయించాలని అడుగుతున్న తమరికి.. మహా మేత కాలం నుండి చేసిన అవినీతి పైన విచారణ జరుపుతుంటే.. జగన్ రెడ్డి మీద కక్ష అంటూ ఏడుస్తావెందుకు ?

  3. అదేంటి గ్రేట్ ఆంద్ర? నీ లాజిక్ ప్రకారం సజ్జలు చేసే పనులు అన్నీ కూడా జగన్ కి అస్సలు తెలియదు కదా.

    అలానే అనితా గారి pa చేసే పనులు కూడా ఆవిడకి తెలియకుండా నే జరిగి వుండాలి కదా.

    ఒకవేళ లేదు తూచ్..నా లాజిక్ తప్పు .

    ఆవిడ pa నేరాలు అన్నిటికీ ఆవిడే కర్త అని అన్నావు అనుకో, అలానే సజ్జలు, విజయసాయి, రాంబాబు, అమర్నాథ్, కొడాలి నాని లాంటి వాళ్ళు చేసిన ప్రతి పనికి జగన్ నే కర్త అని వొప్పుకో…

    1. సజ్జలు చేసిన నేరాలు లో జగన్ మీద కూడా కలిపి కొత్త కేసు*లు పెట్టాలి అని ఎప్పుడు పో*లీసు స్టదన్ కి ఎప్పుడు వెళితు*న్నావు గ్రేట్ ఆంద్ర ?

  4. భర్య పెరు ఉన్న గూడం లొ భారీ ఎత్తున DPS బియ్యం… భర్తకు తెలీకుండా మాయం అవుతాయా గురువిందా? మరి ఎ చర్య తీసుకున్నరు!

    మరి అలానె జగన్, సాయి రెడ్డి, పెద్ది రెడ్డి, సజ్జల రెడ్డి, అవినాష్ రెడ్డి, విక్రాత్ రెడ్డి, ద్వరంపూడి చంద్రశెకర్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నాడా?

  5. జగన్ చెసె తాపులు మాత్రం జగన్ కి తెలీవు! మా అన్న పత్తిత్తు!! అతి మంచివాడు అతినిజాయితీ పరుడు!

    సలహాదారులె తప్పుడు సలహాలు ఇస్తున్నారు!

    నాయకులె దొచుకు తింటూ చెడ్డ పెరు తెస్తున్నరు!

    J- బ్రాండ్ల అవినీతి గురించి జగన్ అన్నకి ఎవరు చెపుతారొ?

    సాయి రెడ్డి విశాక దందా గురించి ఎవరు జగన్ కి చెపుతారొ?

    బాబయి హంతకులకి కొమ్ము కాస్తె పార్టికి నష్టం అని పత్తిత్తు జగన్ కి ఎవరు చెపుతారొ?

    రాజదానుల ముస్టి ఐడియా ఇచ్చిన సలహాదారుడు ఎవరొ?

    అంటూ జగన్ ని వెనుకెసుకొస్టూ ఇన్నాల్లు మూలిగారుగా?

    1. దీన్నే న్యూట్రల్ జర్నలి జం అంటారు..

      న్యూట్రల్ అంటే.. ఒక వైపే గట్టిగా వాదించడం అని అనుకొంటున్నాడేమో.. వెంకటి రెడ్డి..

      1. ಒರೆ ಲಂಜಾ ಕೊಡಾಕ . ವೆರೆ ಪನಿ ಲೆಡ ನೀನು . .ಬಜಾರು ಲಂಜಾ ಕೊಡಕ . ಪೂರಾ ಮೀ ಟಿಡಿಪಿ ವೆಬ್‌ಸೈಟ್ . ಲೋ ಪಡಿ ಚಾವು. ಟಿಡಿಪಿ, ಜನಸೇನಾ ಲಂಜಕೋಡುಕಲ್ಲರ

  6. కానీ ఒక విషయం లో ga గారిని అభినందించాలి అనిత గారే అధికారం చెలాయిస్తున్నారు వేరేవారు ఎవరు జోక్యం లేదు అని ఒప్పుకున్నాడు అదే వైసీపీ లో సుచరిత గారు కానీ వనిత గారి పవర్స్ ఏమిటి ఇప్పటి హోమ్ మినిస్టర్ పవర్ ఏమిటో తెలియ చేసినందుకు థాంక్

  7. వైసిపి ఇంత చిత్తుగా ఓడిపోయినా వాళ్ళని వదలవా శకుని మామ… పది పెద్ద తలకాయలని జైల్ కి పంపనిదే నిద్ర పట్టేట్టు లేదుగా తమరికి

  8. వైసిపి ఇంత చిత్తుగా ఓడిపోయినా వాళ్ళని వదలవా శకుని మామ… పది పెద్ద తలకాయలని జైల్ కి పంపనిదే నిద్ర పట్టేట్టు లేదుగా తమరికి

  9. వేటు వేయడమా బొంగా. సస్పెన్షన్ ఏమీ పనిష్మెంట్ కాదు. సస్పెండ్ అయినా వాడు మేడమ్ ఇంటివద్దే ప్రైవేటు కార్యక్రమాలు కొనసాగిస్తాడు. కారణం ఆవిడ సాగించేది వాడి ద్వారానే కదా

  10. మరి ఈ లెక్క ప్రకారం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తం సియం జగ్గడికి తెలిసే జరిగింది అనుకోవచ్చు కదా…

  11. వైసీపీ గవర్నమెంట్ లో అయితే సదరు పిఏ కి ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చి ఉండేవాళ్ళు.

Comments are closed.