చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు అనీల్ రావిపూడి. మెగాస్టార్ తో సినిమా తన డ్రీమ్ అని, ఇన్నాళ్లకు ఆ కలను నెరవేర్చుకోబోతున్నానని అన్నాడు.
“చిరంజీవితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ దశకు వచ్చాను. ఇంకా ప్రాసెస్ లో ఉంది. అప్పుడే చిరంజీవితో సినిమాపై కామెంట్ చేయలేను. నా కెరీర్ లో ఒక్కొక్క కలను నెరవేర్చుకుంటూ వస్తున్నాను. వెంకటేష్ తో సినిమా.. బాలయ్యతో సినిమా.. ఇప్పుడు చిరంజీవితో సినిమా.. ఇలా ఒక్కొక్క కలను నెరవేర్చుకుంటున్నాను. కచ్చితంగా చిరంజీవితో సినిమా చేస్తా.”
‘గ్రేట్ ఆంధ్ర’కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు అనీల్ రావిపూడి. సినిమాలపై ఆసక్తి రేకెత్తించి, తనను ఇండస్ట్రీ వైపు నడిపించిన హీరోల్ని తను డైరక్ట్ చేస్తుంటే కలిగే ఆనందం నెక్ట్స్ లెవెల్ అంటున్నాడు.
డ్రీమ్స్ ను నెరవేర్చుకునే ప్రాసెస్ లో సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నానని, కేవలం సీనియర్లకే పరిమితమైపోయాననే భావన తనకు కలగలేదంటున్నాడు. అవకాశం వస్తే మళ్లీ మళ్లీ వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవితో సినిమాలు చేయడానికి రెడీ అని ప్రకటించాడు.
మహేష్ తో మూవీ టైం లో కూడా ఇలానే చెప్పాడు…
జాగ్రత్తగా తీయి,
లేకపోతే మరో కొరటాల శివ అవుతావు..
Chiru gaaru great actor..no doubt…
but Ippudu kuda cinema hero ante …last 5 movies emainaayo cheppalsina pani ledu..
rajani kaanth maadiri avvakudadu ani korukuntunna
మూర్తి గారు ఇంటర్వ్యూ బాగా చేస్తారు.