2021 సెప్టెంబర్ లో ప్రారంభమైంది శంకర్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించే రామ్ చరణ్ సినిమా. మూడేళ్లకు విడుదలవుతుందేమో? ఈ సినిమా మీద దిల్ రాజు వందల కోట్లు పెట్టుబడి పెట్టేసారు. ఈ సినిమా ఇంతలా ఆలస్యం కావడానికి ఫ్యాన్స్ తరచు దర్శకుడు శంకర్ ను టార్గెట్ చేస్తుంటారు.
నిజంగా శంకర్ కు వుండే సమస్యలు వున్నాయి. ఇండియన్ 2 తలకెత్తుకోవాల్సి రావడం, ఇంకా చాలా చాలా సమస్యలు ఆయన వైపు నుంచి వున్నాయి. అందువల్ల ఇంతలా ఆలస్యం కావడానికి శంకర్ కారణం అని టాక్ పక్కాగా వుంది.
కానీ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా ప్రకారం గేమ్ ఛేంజర్ ఆలస్యం కావడానికి హీరో రామ్ చరణ్ కూడా కొంత కారణం అని వినిపిస్తోంది. ఆయన వ్యక్తిగత పనులు, పర్యటనలు కారణంగా చాలా రోజులు చరణ్ షూటింగ్ కు హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. ఇలాంటి రోజలు యాభైకి పైగానే వున్నాయని, యాభై కాదు ఎనభై అని కూడా వినిపిస్తోంది. కానీ హీరో కనుక ఎవ్వరూ దాన్ని లెక్కలోకి తీసుకోరు. హీరోను అడిగి షెడ్యూలు వేస్తారు కనుక, అవి ఆబ్సెంట్ ల కిందకు రావు.
గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమిటి? ఎప్పటికి పూర్తవుతుంది.. ఎప్పుడు విడుదలవుతుంది అనే అంచనా ఇద్దరికే వుంది. ఒకరు నిర్మాత దిల్ రాజు, రెండు దర్శకుడు శంకర్. అసలు ఇంకా ఎంత షూట్ బకాయి వుందీ అన్నది కూడా తెలిసింది ఆ ఇద్దరికే.
ఇప్పటి వరకు ఇండియన్ 2 రిలీజ్ డేట్ ను బట్టి గేమ్ ఛేంజర్ డెేట్ అంటూ లెక్కలు కట్టారు. జూన్ లో ఇండియన్ 2 వచ్చేస్తోంది. పుష్ప2, ప్రాజెక్ట్ కె, దేవర, ఓజి, సినిమాలు లైన్ లో వున్నాయి. ఇవన్నీ చూసుకుని అప్పుడు గేమ్ ఛేంజర్ కు డేట్ ఫిక్స్ చేయాలి. సంక్రాంతికి చాన్స్ లేదు. ఎందుకుంటే చరణ్ తండ్రి మెగాస్టార్ సినిమా వుంది. అందువల్ల ఈ లోగానే విడుదల చేసేయాల్సి వుంటుంది.