Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రభాస్.. మోహన్ లాల్.. అక్షయ్ కుమార్

ప్రభాస్.. మోహన్ లాల్.. అక్షయ్ కుమార్

మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమా స్టార్ కాస్ట్ అలా అలా పెరిగిపోతూనే వుంది. ఈ పాన్ ఇండియా పౌరాణిక సినిమాలో దాదాపు అన్ని భాషల స్టార్స్ ను ఏదో ఒక పాత్రలో చూపించే ప్రయత్నం మంచు విష్ణు గట్టిగా చేస్తున్నట్ల కనిపిస్తోంది.

ఇప్పటికే ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్ ల పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పేరు చేరింది ఈ జాబితాలో.

ఇప్పటికి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ స్టార్ కాస్ట్ అంతా కన్నప్ప సినిమాలో వుంది. కన్నడ రంగం నుంచి కూడా ఎవరో ఒకరిని సెట్ చేస్తారేమో? శివరాజ్ కుమార్ ను ప్రయత్నించారని, డేట్ లు సెట్ కాలేదని తెలుస్తోంది.

టొటల్ గా న్యూజిలాండ్ లోనే చిత్రీకరిస్తున్నారు కన్నప్ప సినిమాను. చాలా హై టెక్నికల్ టీమ్ ను ఎంగేజ్ చేసారు. ఈ సినిమాకు సంబంధించి కన్నప్పగా మంచు విష్ణు ఫస్ట్ లుక్ వచ్చింది ఇప్పటికే, దసరాకు విడుదల అనే ఫీలర్ కూడా వచ్చింది.

కన్నప్ప సినిమా అంటే మన కళ్ల ముందు బాపు- రమణల భక్తకన్నప్ప సినిమా, ఆ పాటలు మెదుల్తాయి. ఈ కన్నప్ప ఆ విధంగా కూడా అంతకు మించి వుండాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?