సంక్రాంతి సినిమాల ప్రచారం స్పీడ్ అందుకుంటోంది. గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఇప్పుడు డాకూ మహారాజ్ ట్రైలర్ రాబోతోంది. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ కావాల్సి ఉంది. 5న ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. అటు డల్లాస్‌లో, ఇటు తెలుగు నాట ఒకేసారి ట్రైలర్‌ను విడుదల చేస్తారు. వాల్తేర్ వీరయ్య తరువాత బాబీ చేస్తున్న సినిమా ఇది. అలాగే వరుస విజయాల తరువాత బాలయ్య చేస్తున్న సినిమా. అందువల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ట్రైలర్ వస్తోంది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలకు అంత గొప్ప రెస్పాన్స్ రాలేదు. అందువల్ల సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత ట్రైలర్‌దే. ట్రైలర్ కట్ పక్కా మాస్ యాక్షన్ దిశగా సాగుతుందా? లేదా ఎమోషన్ యాడ్ అవుతుందా అన్నది చూడాలి.
యాక్షన్ విత్ ఎమోషన్ ఉంటే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. కానీ బాలయ్య అంటే డైలాగ్ పవర్ కూడా యాడ్ అవ్వాలి. బాబీ సినిమాకు ఎలాంటి డైలాగులు అందించారు అన్నది చూడాలి. బాబీ డెప్త్ ఉన్న డైలాగులు, ఫన్ డైలాగులు బాగా రాస్తారు. ఎమోషన్, పవర్‌ఫుల్ డైలాగులు పడాలి బాలయ్య సినిమా అంటే.
బాలయ్య సినిమాకు మరో ప్లస్ థమన్. మిగిలిన సినిమాలకు బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చే ఆర్ఆర్ తేడా ఉంటుంది. ట్రైలర్‌లో ఆ తేడా కనిపించాల్సి ఉంది.
ట్రైలర్ 5న వదిలిన తరువాత 7న హైదరాబాద్ లో ఈవెంట్ ఉంటుంది. 9న అనంతపురం ఈవెంట్ ఉంటుంది. ఇక అక్కడితో ప్రచారం సమాప్తి అవుతుంది. 10 నుంచి సంక్రాంతి సినిమాల దాడి మొదలవుతుంది.
Hi
Definitely this movie will flop among 3 releases
Don’t underestimate the director who gave true hit to chiru after a long time.
Nv kadu me dady kuda cheyalefura flop