సారీ డాకూ.. నీ సినిమా చూడం!

జై లవకుశ సినిమాను, అందులో నటించిన ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించలేదు. చర్చించలేదు అనే కంటే కావాలని కట్ చేశారని అనడం కరెక్ట్.

ఊహించని విధంగా ‘డాకు మహారాజ్’ సినిమా వివాదాస్పదమౌతోంది. మొన్న రిలీజైన సాంగ్ లో బాలకృష్ణ వేసిన స్టెప్పులతోనే ప్రాబ్లమ్ అనుకుంటే, ఇప్పుడు అంతకుమించిన సమస్య వచ్చి పడింది. ఈసారి వచ్చింది చిన్న సమస్య కాదు, సినిమాపై పెద్ద ప్రభావం చూపించే సమస్య.

ప్రమోషన్ లో భాగంగా డాకు ఆర్మీ పేరిట యూనిట్, అన్ స్టాపబుల్ కు వచ్చింది. బాలకృష్ణ హోస్ట్ గా.. బాబి, నాగవంశీ, తమన్ గెస్టులుగా కొత్త ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ, కార్యక్రమంలో తప్పు జరిగిపోయింది.

బాబి డైరక్ట్ చేసిన సినిమాల గురించి, అందులో హీరోల గురించి మాట్లాడుతూ.. జై లవకుశ సినిమాను, అందులో నటించిన ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించలేదు. చర్చించలేదు అనే కంటే కావాలని కట్ చేశారని అనడం కరెక్ట్. ఎందుకంటే, ఆ సీక్వెన్స్ అలా ఉంది మరి.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఎన్టీఆర్ పేరు పలకడానికి, అతడి సినిమాల గురించి చర్చించడానికి అంత ఇష్టం లేనప్పుడు, అసలు ఆ సెగ్మెంట్ పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అంతా చేసి కావాలని తమ హీరో పేరును, సినిమాల్ని కట్ చేశారని ఆరోపిస్తున్నారు.

పరిస్థితి చేయి దాటిపోయిందని నిర్మాత నాగవంశీకి అర్థమైంది. డ్యామేడ్ కంట్రోల్ లో భాగంగా పేర్లు ప్రస్తావించకుండా అతడో ట్వీట్ వేశాడు. “ఇది మనందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి, మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రయత్నిద్దాం.” అంటూ పోస్ట్ పెట్టాడు.

ఈ ట్వీట్ తో నాగవంశీ, వ్యవహారాన్ని మరింత కెలికినట్టయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడిపై విరుచుకుపడుతున్నారు. ‘ఈ ఒక్కసారి నీ సినిమా చూడం’ అంటూ వందలాది పోస్టులు కనిపిస్తున్నాయి. డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటూ సెటైర్లు కూడా కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ కు వీరాభిమానినని, కేవలం తారక్ పై ఇష్టంతోనే దేవర సినిమాను రిలీజ్ చేశానంటూ గతంలో చెప్పుకున్న నాగవంశీ, ఇప్పుడు తనకుతాను బాలకృష్ణ ఫ్యాన్ గా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు నెటిజన్లు.

అటు బాలకృష్ణ అభిమానులు మాత్రం, తమకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ అక్కర్లేదని, తామే సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తామంటూ చెప్పుకుంటున్నారు. తాజా పరిణామాలతో డాకు మహారాజ్ సినిమా మరింత వివాదాస్పదమైంది.

21 Replies to “సారీ డాకూ.. నీ సినిమా చూడం!”

  1. సొల్లు అపరా అయ్య!

    అయన ఇష్టం, మాట్లాడలి అనుకుంటె మాట్లాడతాడు, లెదు అనుకుంటె లెదు. ఈ మాత్రం దానికె ఎదొ అయిపొయినట్టు నీ గొల ఎమిటి రా GA!

  2. Venkati sir @11 people will see movies if the movie is good. Allu said cheppanu brother annaaka kooda aayana Cinemas Samudramanthunna Pavan Kalyan fans choosasru aaadarinchaaru. Idi anthe…you obviously give 2.25 rating for all balaiahs movies. You have given 1.75 and after that 1 hour you changed to 2.25. For Balaiah movies you give ur fixed rating 2.25 and then you start writing the review.

  3. Balakrishna should have talked about all the movies as an artist and as a co-hero. There is nothing wrong. Personal/family issues cannot be revealed in public. It is a damage for him. I watch his movie in OTT only.

  4. మాడా గాడు బెంగుళూర్ లో చాప ఎక్కేడు, ఇంక నీకు తెలిసిన ఏ మగాడు లేక NTR ని పట్టుకున్నావా??

  5. Nee brathuku motham pullalu petti ENJOY CHEYATAME , NEEKU EVVARU CHEPPARU NTR FANS DAAKU CHOODAM ANI ,Im NTR FAN IM GOING TO SEE BENFIT SHOW , FAMILY VISHAYALU NEEKU YENDHUKURA vedhava

  6. ఈ బాలకృష్ణ కనీసం ఒక రోజు ఐనా హిందూపూర్ లో ఉండకుండా జనాల నియోజకవర్గ సమస్యలు గాలికి వొదిలి ఈ show చేసుకొని రెండు చేతులా బాగా సంపాదిస్తున్నాడు

Comments are closed.