కేసీఆర్ హయాం నాటి వ్యవస్థలను, పేర్లను, విగ్రహాలను మార్చడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ లక్ష్యంలో చాలావాటిని పూర్తి చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. తెలంగాణా అధికారిక గేయాన్ని మార్చారు.
ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు చేశారు. ధరణిని మార్చి దానికి భూభారతి అని పేరు పెట్టారు. ఇలా చాలా చేశారు. తెలంగాణకు కేసీఆర్ హయాంలో టీఎస్ అని పెడితే దాన్ని రేవంత్ రెడ్డి టీజీ అని మార్చారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ ఫ్యామిలీని జైళ్లలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా చూసిన గులాబీ పార్టీ కుతకుతలాడిపోతోంది. కేటీఆర్ తాజాగా ఓ విషయం చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం పేరును టీజీ అని మార్చడానికి రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లు ఖర్చు చేశాడట.
కానీ ఏ విధంగా ఖర్చయిందో వివరించలేదు. ప్రభుత్వం టీజీ అని మార్చేవరకల్లా అన్ని ప్రభుత్వ సంస్థలు తమ పేర్లలో టీఎస్ అని తీసేసి టీజీ అని పెట్టాయి. ఉదాహరణకు… టీఎస్ ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీగా మారిపోయింది. ఇలా చాలా సంస్థలు పేర్లు మార్చుకున్నాయి.
ఒక్క అక్షరం మార్చడానికి వెయ్యి కోట్లు కాదు, లక్ష కోట్లు ఖర్చు చేసినా తెలంగాణా అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి చెరపలేడని కేటీఆర్ అన్నారు. నాలుగు కోట్ల మంది గుండెలపై కేసీఆర్ చేసిన సంతకాన్ని చెరపలేడని అన్నాడు. అనవసరమైనవాటికోసం వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించాడు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు దిక్కులేదుగానీ, దుబారా ఖర్చులో రేవంత్ సర్కారు ముందు ఉందని కేటీఆర్ ఘాటుగా విమర్శించాడు. సీఎం పదవి కోసం తాను, కవిత పోటీ పడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నాడు. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికే తాను రోడ్డు ఎక్కుతున్నానని చెప్పాడు. కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది.
డబ్బులు తీసుకోని కమాంట్ చేసె టీడీపీ , జనసేన బ్యాచ్ ఎక్కడా ?? ఇంకా రాలేదు?
PayTM పడిందిగా నువ్వు లగెత్తుకువచ్చావ్
ఈ ఆర్టికల్ ఎవ్వని గురించి…. ఈ రాము గాడు అన్నట్టు ఇది ఎక్కడో తెలంగాణలో జరిగే పంచాయతీ ఏదైనా వుంటే వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు మాకెందుకు నొప్పి
P/k sharma
ఒక పక్కన రాజధాని నీ మార్చేస్తూ ఒక తరం జీవితాలతో మా అన్న ఆడుకుంటే…తొక్కలో వెయ్యి కోట్లు…జుజుబీ
మా అన్న రంగులు వెయ్యడానికి వేసిన రంగులు తియ్యడానికి వెయ్యి కోట్లు
Mari TelanGana ki TS ani yendhuku petaaru KTR; shouldn’t it be TG?