‘సంక్రాంతి’ రిస్కా? ప్రయోగమా?

వెంకీ-ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు ఓటిటి స్లాట్ దొరకలేదు.

టాలీవుడ్ ను ఓటిటి శాసిస్తోంది. ఎప్పుడు తమకు స్లాట్ ఖాళీ ఉంటే దాన్ని బట్టి విడుదల డేట్ ను డిసైడ్ చేసుకోమంటున్నాయి ఓటిటి సంస్థలు. అలా కాదు అంటే వాటికి తోచిన రేటు ఇస్తున్నాయి, తప్ప మంచి రేటు రాదు. విడుదల తరువాత మంచి రేటు రావాలి అంటే సినిమా బాగుంది అనే టాక్ రావాలి. అలా టాక్ వస్తే ఓటిటి సంస్థలతో బేరాలకు దిగవచ్చు. ఇలా దిగే అవకాశం ఉంటుందో, వుండదో అనే అనుమానంతో నిర్మాతలు ముందే సరెండర్ అయిపోతున్నారు.

గతంలో పీపుల్స్ మీడియా ధైర్యం చేసి ఓటిటి అగ్రిమెంట్ లు కాకుండా సినిమాలు విడుదల చేసి నష్టపోయిన వైనం ఉంది. అందుకే చాలా మంది అసలు అలా ధైర్యం చేసే ఆలోచనే మానేసారు.

ఇలాంటి నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి, సబ్జెక్ట్ మీద నమ్మకంతో, సినిమా మీద నమ్మకంతో ధైర్యం చేసి ఓటిటితో పని లేకుండా ముందుకు వెళ్తున్నారు. వెంకీ-ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు ఓటిటి స్లాట్ దొరకలేదు. అంటే సంక్రాంతి విడుదలకు స్లాట్ దొరకలేదు. అదే సినిమాను ఏ ఏప్రియల్, మేలో విడుదల చేసుకుంటాం అంటే ఓటిటి జనాలు కళ్లకు అద్దుకుని తీసుకునేవారేమో? అది వేరే సంగతి.

ప్రస్తుతానికి అయితే “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాను నాన్ థియేటర్ అమ్మకాల మీద ఆధారపడకుండానే ముందుకు విడుదల దిశగా వెళ్లిపోతున్నారు. సినిమాకు 55 కోట్ల వరకు ఖర్చయింది. నాన్ థియేటర్ అమ్మకాలు జరగకుండా రికవరీ అన్నది అసాధ్యం. థియేటర్ మీద 30 కోట్ల వరకు రికవరీ వస్తోంది. మరో పాతిక కోట్లు రావాల్సి ఉంది. శాటిలైట్ అమ్మకాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి. అడియో రైట్స్ రెండున్నర కోట్ల మేరకు వచ్చాయి. అంటే ఓ 15 కోట్లకు కాస్త అటు ఇటు వుంటుంది.

సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే నిర్మాత దిల్ రాజు పంట పండినట్లే. ఎందుకంటే కనీసం 20 నుంచి 25 కోట్లు ఓటిటి రైట్స్ పలుకుతాయి. లేదూ సరైన టాక్ రాకున్నా కూడా పది కోట్ల మేరకు రైట్స్ వస్తాయి. అక్కడ కాస్త నష్టం వస్తే, అది థియేటర్ మీద రికవరీ చేసుకోగలగాలి.

One Reply to “‘సంక్రాంతి’ రిస్కా? ప్రయోగమా?”

  1. సంక్రాంతి ఛాయిస్….ఈ మూవీ నే….దిల్ రాజు తడి గుడ్డ వేసుకుని కూర్చో వచ్చు

Comments are closed.