నాయుళ్లిద్దరూ కలిసిన తర్వాత జోరు మారిందే!

ఎన్నికలప్పుడు మాత్రం డప్పు కొట్టి వదిలేస్తే ఎలా.. ఎన్నికల తర్వాత కూడా వీలైనన్ని అబద్ధాలను ప్రజల బుర్రల్లోకి దూర్చకపోతే మనం మనగలిగేది ఎలా

నారా చంద్రబాబు నాయుడుకు పాపం సొంత మీడియా సంస్థ లేదు. తన గురించి తాను సొంత డప్పు కొట్టుకోవడానికి ఆయనకు సొంత వ్యవస్థ లేదు. బహుశా అందుకే కాబోలు.. ఎంతో మంది ఆయన డప్పు కొట్టడానికి ఎగబడి మరీ అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. పూనకం తెచ్చుకుని మరీ ఆయన డప్పు కొడుతుంటారు. అందుకు తగిన మోతాదులో ప్రత్యుపకారం పొందుతూ ఉంటారు.

ఎన్నికల వేళ బాబుగారి డప్పు కొట్టడంలో తరించిపోయి, అంతకుమించి జగన్ ను విలన్ గా ప్రజల ఎదుట నిలబెట్టడానికి తపించిపోయిన వారు… పార్టీ అధికారంలోకి రాగానే తదనుగుణమైన ప్రత్యుపకారాలు పొందారు. అలాంటి మీడియా సంస్థల్లో ఒక దానికి అధిపతి అయిన ఒక నాయుడు గారు.. రాష్ట్రంలో ఏ నామినేటెడ్ పదవినైతే.. మంత్రి పదవి కంటె ఎక్కువగా అందరూ భావిస్తుంటారో.. ఏ పదవికోసం దేశం మొత్తం నుంచి కూడా అత్యున్నత స్థాయి పైరవీలు జరుగుతూ ఉంటాయో అలాంటి పదవిని దక్కించుకున్నారు.

ఆ నాయుడు గారు.. ఇటీవల తెలంగాణలోని తన మూల వ్యాపారాలను కాపాడుకోవడానికి, తెలంగాణలోని తన ఆస్తులను కాపాడుకోవడానికి అక్కడి పెద్దలందరికీ సామూహికంగా మేలు చేసే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమల్లో పెట్టడం అనేది ఆయన చేతిలోనే పనే! కానీ.. చంద్రబాబునాయుడు గారి కళ్లలో ఆనందం చూడడానికి, ఈ నాయుడు గారు అమరావతి వెళ్లి ఆయన వద్ద ఒక ముద్ర వేయించుకున్నారు.

తెలంగాణ పెద్దల ప్రీత్యర్థం చంద్రబాబు గారే ఆ నిర్ణయం తీసుకోమని సూచించినట్టుగా సెలవిచ్చారు. అయితే మధ్యలో మతలబు ఏంటంటే.. ఈ ఇద్దరు నాయుళ్లూ భేటీ అయిన తరువాత.. పదవుల నాయుడు గారి మీడియా సంస్థలో చంద్రనాయుడు గారి భజన అనేది టాప్ గేర్ లోకి వెళ్లిపోయింది.

‘ఎన్నికలప్పుడు మాత్రం డప్పు కొట్టి వదిలేస్తే ఎలా.. ఎన్నికల తర్వాత కూడా వీలైనన్ని అబద్ధాలను ప్రజల బుర్రల్లోకి దూర్చకపోతే మనం మనగలిగేది ఎలా’ అని పెద్ద నాయుడు గారు.. చిన్న నాయుడు గారిని ఆదేశించారో ఏమో తెలియదు గానీ.. చంద్రనాయుడు గారు.. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీని కూడా కేవలం ఆరునెలల్లోనే అమలు చేసి చూపించేసినట్టుగా ఊరదగొడుతూ కథనాల్ని తమ చానెల్లో వండి వారుస్తున్నారు.

అమలులోకి వచ్చిన హామీలు, అమలు చేస్తాం అని చెబుతున్న హామీలు, అమలుకు సుదూర డెడ్ లైన్లు ప్రకటించి ప్రజలను ఊరిస్తున్న హామీలు ఇవన్నీ పూర్తయిపోయినట్టుగా ప్రజలను మభ్యపుచ్చే కథనాలు మాత్రమే కాదు.. సగం హామీల విషయంలో ‘ఆలోచన చేస్తుండడం’ కూడా ఒక మహాద్భుతమే అన్నట్టుగా చిన్న నాయుడు గారు ప్రచారం సాగిస్తున్నారు.

చంద్రనాయుడు గారితో భేటీ తరువాత.. ప్రయోజనాలు పొందిన నాయుడు గారు.. ప్రత్యుపకారాల విషయంలో మహా జోరు కనబరుస్తున్నారే అని ప్రజలు విస్తుపోతున్నారు.

12 Replies to “నాయుళ్లిద్దరూ కలిసిన తర్వాత జోరు మారిందే!”

  1. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇక్కడ కమాంట్ చేసే ప్రతి టీడీపీ, జనసేన – ల0జా కొడుకులందరూ డబ్బులు తీసుకోని కమాంట్లు చేస్తారు. వీళ్లు చేసిన కామెంట్స్ ని స్క్రీన్ షాట్ తీసి టీడీపీ , జనసేన నాయకులకి పంపిస్తే వాళ్ళు డబ్బులు వేస్తారు, డబ్బు కోసం ఏమైన చేస్తారు ఈ కమాంట్స్ బాచ్ ల0జాకొడుకులు

  2. డబ్బులు తీసుకోని కమాంట్ చేసె టీడీపీ , జనసేన బ్యాచ్ ఎక్కడా ?? ఇంకా రాలేదు?

  3. సొంత డప్పు కొట్టుకొవటం అంటె…

    నాకు శాలువాలు కప్పాలి…

    ఎవార్డులు ఇవ్వాలి…

    దండెసి దానం పెట్టలి…

    ఇలా అడుక్కొవ్వటం అనుకుంటా?

    1. కాదు కాదు

      నేను వేసిన రోడ్స్ వాడుతున్నారు

      నేను కట్టిన బాత్రూమ్లు వాడుతున్నారు నాకే ఓటు వెయ్యాలి

      అన్నిటికీ నేనే అంటారు కదా అలా అన్నమాట

    1. ఎవడు పొతే బాగుంటుందో అయిదు కోట్ల ఆంధ్రుల డిసైడ్ చేసింది ఆరు నెలల క్రితమేగా

Comments are closed.