ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేట్ పీఏ సంధు జగదీష్‌పై వేటు వేయడంతో అవినీతిపై చర్చకు తెరలేచింది. ముఖ్యంగా మంత్రుల అధికార, అనధికార పీఏలు, అలాగే అమాత్యుల పేషీల్లో పని చేసే వివిధ స్థాయిల్లోని ఉద్యోగుల వ్యవహారాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవినీతికి పాల్పడుతున్న వారిపై ఇంటెలిజెన్స్ శాఖ సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించినట్టు ప్రచారమవుతోంది.
ఇంకా మరికొందరు అవినీతిపరుల్ని తొలగించొచ్చనే వాదన లేకపోలేదు. దీంతో వాళ్లంతా ఉలిక్కిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు అవినీతి అంటే ఏంటో తెలియనంత పునీతులా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏఏ మంత్రి ఎలాంటి వారో, అలాగే ఎమ్మెల్యేల అవినీతి బాగోతం గురించి జనం కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. వీటిపై కూడా చంద్రబాబునాయుడి వద్ద నిఘా వర్గాల నివేదిక వుంది.
అనిత ప్రైవేట్ పీఏను తప్పించినంత సులభంగా, మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా సాగనంపే సాహసం సీఎం చేయగలరా? అనే నిలదీతకు సమాధానం కూటమి ప్రభుత్వ పెద్దలే చెప్పాల్సి వుంటుంది. అమాత్యుల అండదండలు లేనిదే పీఏలు అవినీతికి పాల్పడేంత సీన్ వుంటుందా? అనే చర్చకు తెరలేచింది.
కూటమి పాలనలో దొరికితే దొంగ, లేదంటే దొర అనే సామెత చందంగా తయారైందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. కాకపోతే పెద్ద నాయకులకు కూడా దోచిపెట్టే లాబీయిస్టులను అత్యున్నత చట్టసభలకు పంపుతారని, చిన్నవాళ్లైతే వేటు వేసి, తాము నీతివంతమైన పరిపాలన అందిస్తున్నట్టు మీడియాను అడ్డు పెట్టుకుని ప్రచారం చేసుకుంటారనే వాదన వినిపిస్తోంది.
పనిమంతుల్నే మంత్రులు, ఎమ్మెల్యేలు పీఏలుగా పెట్టుకుంటుంటారు. రాజకీయ నాయకుల దృష్టిలో పనిమంతులంటే … సంపాదించే తెలివితేటలున్న వారని అర్థం. ఇవన్నీ అందరికీ తెలిసినవే. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో దోపిడీ, సంపాదన గురించి చంద్రబాబుకు తెలిసినంతగా , మరే ఇతర నాయకులకు తెలియవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకు ఆయన ఆస్తులే నిలువెత్తు సాక్ష్యం. నీతులు, సూక్తులు ఎదుటి వాళ్లకు చెప్పడానికే. రాజకీయ పెద్దలకు కానేకాదని ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
డబ్బులు తీసుకోని కమాంట్ చేసె టీడీపీ , జనసేన బ్యాచ్ ఎక్కడా ?? ఇంకా రాలేదు?
మరి ఐప్యాక్ వాళ్ళు సలహాదారులు పాపాత్ములు అన్న పునీతుడా ???!!
మేనేజర్ పాపాత్ముడు పేర్ని పునీతుడు అయ్యాడా ???అందుకే కక్ష సాధింపు అని మొన్న ఏడ్చారా ???