భీమ్స్ ఇదే మంచి చాన్స్

మెగాస్టార్ కూడా కొత్త టాలెంట్ అంటే ఓకె అంటారు. కానీ ఈ చాన్స్‌ను బీమ్స్ నిలబెట్టుకోవాలి. ఈ ఒక్క చాన్స్‌ను సరిగ్గా వాడుకుంటే బీమ్స్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్లిపోతారు.

మిడ్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది వున్నారు. మంచి ఆల్బమ్‌లను ఇస్తున్నారు. కానీ తరువాత రేంజ్‌కు మాత్రం చేరుకోవడం లేదు. అలా అని అవకాశాలు రావడం లేదా అంటే వస్తున్నాయి. కానీ నిలబెట్టుకోవడం తక్కువగా ఉంది. అందుకే ఇప్పటికీ థమన్, డిఎస్పీ లాంటి పేర్లే తరచు వినిపిస్తున్నాయి. వాళ్ల పేర్ల వల్ల అడియో రైట్స్‌కు మంచి మొత్తాలు అందుతున్నాయి. అందుకే అటు వెళ్తున్నారు నిర్మాతలు.

గతంలో అనూప్ రూబెన్స్ ఓ రేంజ్ వరకు వచ్చారు. నాగ్ సినిమాలకు మంచి ఆల్బమ్‌లను ఇచ్చారు. కానీ ఆ ఫ్లో కంటిన్యూ చేయలేకపోయారు. సగంలోనే వుండిపోయి, అక్కడే అటు ఇటు తిరుగుతున్నారు.

మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ కూడా ఇదే విధంగా మంచి ఆల్బమ్‌లను ఇచ్చారు. మెగాస్టార్ సినిమా చేతిలోకి వచ్చింది కానీ పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోయారు. దాంతో వెనుకబడిపోయారు.

ఇప్పుడు బీమ్స్ టైమ్ వచ్చింది. ధమాకా లాంటి సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి థమన్‌తో పోటీ పడి, “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు మూడు మంచి పాటలు ఇచ్చారు. సంక్రాంతి సినిమాల పాటలు అంటే బీమ్స్ పాటలే గుర్తుకు వస్తున్నాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను మెగాస్టార్‌తో చేయబోతున్నారు. మళ్లీ బీమ్స్‌తోనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మెగాస్టార్ కూడా కొత్త టాలెంట్ అంటే ఓకె అంటారు. కానీ ఈ చాన్స్‌ను బీమ్స్ నిలబెట్టుకోవాలి. ఈ ఒక్క చాన్స్‌ను సరిగ్గా వాడుకుంటే బీమ్స్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్లిపోతారు.

One Reply to “భీమ్స్ ఇదే మంచి చాన్స్”

Comments are closed.