కియరా కావాలని హ్యాండ్ ఇవ్వలేదంట!

శంకర్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అంటున్నాడు చరణ్. మేకింగ్ విషయంలో శంకర్ నిబద్ధత చూసి షాక్ అయ్యాడంట.

రాకరాక నిన్ననే గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ కు హాజరైంది కియరా అద్వానీ. అంతలోనే షాకింగ్, బ్రేకింగ్ న్యూస్ లు. కియరా అద్వానీ అనారోగ్యం పాలైంది, ఆమె హాస్పిటల్ లో జాయిన్ అయిందంటూ కథనాలు.

గేమ్ ఛేంజర్ ప్రచారం ప్రారంభించిన కొత్తలో కియరా కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా మాయమైంది. డాలస్ లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు, హైదరాబాద్ లో జరిగిన ట్రయిలర్ లాంఛ్ కు ఆమె రాలేదు.

నిన్న ముంబయిలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో రామ్ చరణ్, కియరా కలిసి పాల్గొన్నారు. బిగ్ బాస్ హౌజ్ లో కూడా మెరిశారు. అయితే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ కు మళ్లీ ఆమె డుమ్మా కొట్టింది. దీంతో ఆమె అనారోగ్యం పాలైందంటూ పుకార్లు మొదలయ్యాయి.

తాజా రూమర్లపై కియారా టీమ్ క్లారిటీ ఇచ్చింది. గ్యాప్ లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కియరాకు తీవ్రమైన తలనొప్పి వచ్చిందంట. అందుకే ఆమె ఇంట్లోనే రెస్ట్ తీసుకుందని, ఫలితంగా గేమ్ ఛేంజర్ ముంబయి ప్రెస్ మీట్ కు రాలేకపోయిందని క్లారిటీ ఇచ్చింది.

5 శాతం తేడా కూడా ఒప్పుకోడంట..

మరోవైపు ముంబయిలో జరిగిన ప్రెస్ మీట్ లో చరణ్, ఎస్ జే సూర్య, దిల్ రాజు మాత్రమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ ప్రాజెక్టు తన వద్దకు ఎలా వచ్చింది, మేకింగ్ లో అతడు ఎంత నిక్కచ్చిగా ఉంటాడనే విషయాల్ని చరణ్ బయటపెట్టాడు.

రామోజీ ఫిలింసిటీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నప్పుడు దిల్ రాజు వచ్చాడంట. శంకర్ తో సినిమా చేద్దామని చెప్పాడంట. షూటింగ్ హడావుడిలో ఉన్న రామ్ చరణ్, శంకర్ అంటే ఎవరో అనుకున్నాడట, తర్వాత మాట్లాడదాం అన్నాడట. ఆ తర్వాత సీనియర్ డైరక్టర్ శంకర్ అని తెలుసుకొని వెంటనే అలర్ట్ అయ్యాడంట.

శంకర్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అంటున్నాడు చరణ్. మేకింగ్ విషయంలో శంకర్ నిబద్ధత చూసి షాక్ అయ్యాడంట. ఓ షాట్ లో తన హెయిర్ స్టయిల్ లో చిన్న మార్పు గమనించాడని, కేవలం 5 శాతం తేడా మాత్రమే ఉందని, దాన్ని కూడా శంకర్ సహించలేదని చెప్పుకొచ్చాడు.

5 Replies to “కియరా కావాలని హ్యాండ్ ఇవ్వలేదంట!”

  1. నువ్వు ఎంత నెగటివ్ గా రాస్తావో రాయి నిన్ను వెంటాడుతూనే ఉంటాం

Comments are closed.