గేమ్ ఛేంజర్.. పుష్ప-2 కంటే కాస్త తక్కువ..!

గేమ్ ఛేంజర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులిచ్చింది. అర్థరాత్రి ఒంటి గంట ఆట (బెనిఫిట్ షో)కు అనుమతినిచ్చింది.

పుష్ప-2 సినిమాకు విడుదలకు ముందు రోజే ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాయి. ఆ ఒక్క షోకు టికెట్ రేటు లోవర్ క్లాస్, అప్పర్ క్లాస్ అనే తేడా లేకుండా ఫ్లాట్ గా 800 రూపాయలు చేశారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు కూడా దాదాపు అదే స్థాయిలో ప్రత్యేక అనుమతులొచ్చాయి. కాకపోతే కాస్త తక్కువ.

గేమ్ ఛేంజర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులిచ్చింది. అర్థరాత్రి ఒంటి గంట ఆట (బెనిఫిట్ షో)కు అనుమతినిచ్చింది. ఈ ఒక్క షోకు 600 రూపాయలు టికెట్ రేటు పెట్టుకోవచ్చని తెలిపింది.

ఇక విడుదల రోజైన 10వ తేదీన 6 షోలకు అనుమతులిచ్చింది. ఆరోజు ఏపీలో ఉదయం 4 గంటల నుంచే షోలు మొదలవుతాయి. ఆ ఒక్క రోజు మల్టీప్లెక్సుల్లో టికెట్ పై 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ పై 135 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది.

ఇక 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 13 రోజుల పాటు రాష్ట్రంలో రోజుకు 5 షోలు వేసుకోవచ్చని తెలిపింది. ఈరోజుల్లో కూడా మల్టీప్లెక్సుల్లో 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 135 రూపాయలు రేట్లు పెంచుకోడానికి అనుమతిచ్చింది.

బెనిఫిట్ షోతో పోలిస్తే, పుష్ప-2 కంటే గేమ్ ఛేంజర్ కు రేటు పెంపు తక్కువగా ఉన్నట్టు అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా చూసుకుంటే గేమ్ ఛేంజర్ కు, పుష్ప-2కు ఒకే తరహా ‘ప్రత్యేక’ లబ్ది చేకూరినట్టయింది.

పుష్ప-2 సినిమాకు టికెట్ రేట్ల పెంపులో శ్లాబ్ సిస్టమ్ పెట్టారు. గేమ్ ఛేంజర్ కు మాత్రం ఎలాంటి శ్లాబ్ సిస్టమ్ లేకుండా, 13 రోజుల పాటు (అప్పర్-లోవర్ అనే సంబంధం లేకుండా) ఫ్లాట్ గా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఎలా చూసుకున్నా ఈ పెంపు సమానమే. పుష్ప-2కు కూడా 13 రోజులకే ప్రత్యేక అనుమతిచ్చారు.

10 Replies to “గేమ్ ఛేంజర్.. పుష్ప-2 కంటే కాస్త తక్కువ..!”

  1. ఎలాగైనా ప్రజల (పిచ్చి అభిమానుల) నుండి అధికారికంగా దోచుకోడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది… ఇదండీ సంగతి…

Comments are closed.