ఆమె హైదరాబాద్ వస్తుంది, మళ్లీ సినిమాల్లో నటిస్తుందని ఆశిస్తున్న అభిమానులకు చిన్నపాటి షాక్ ఇది. హైదరాబాద్ లో తన ప్రాపర్టీని అనుష్క అమ్మేసినట్టు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ లో అనుష్కకు ఓ ఇల్లు ఉంది. చాన్నాళ్ల కిందటే ఆ ఇల్లు ఆమె పేరిట రిజిస్టర్ అయింది. ఇప్పుడా ఇంటిని ఆమె అమ్మేసినట్టు తెలుస్తోంది.
సినీ ప్రముఖులంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలికి మారుతున్న నేపథ్యంలో అనుష్క ఈ నిర్ణయం తీసుకుందా.. లేక హైదరాబాద్ తో ఆమె అనుబంధాన్ని తగ్గించుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.
ఈ లావాదేవీ విలువ ఎంత అనే విషయాన్ని పక్కనపెడితే, హైదరాబాద్ లో ఉన్న ఇంటిని అమ్మేయడంతో ఆమె కెరీర్ పై కొత్త చర్చ మొదలైంది.
ఇప్పటికే బాగా సినిమాలు తగ్గించేసింది అనుష్క. ఘాటీ తర్వాత మరో సినిమా మొదలుపెట్టలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఇంకో సినిమా చేస్తుందంటూ ప్రచారం జరిగినప్పటికీ, అది కూడా కార్యరూపం దాల్చలేదు.
మరోవైపు ఆమె పెళ్లిపై వినిపిస్తున్న పుకార్ల సంగతి సరేసరి. ఎప్పటికప్పుడు ఆమె పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని అనుష్క టీమ్ ఖండిస్తూనే ఉంది. ఇప్పుడీ ఇంటి మేటర్ బయటకొచ్చింది.
ఇలా కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా అంతా అస్పష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఆమె తన ఇంటిని అమ్మేసిందనే ప్రచారం, చాలామందిలో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆమెకు హైదరాబాద్ శివార్లలో ఓ ఫామ్ హౌజ్ కూడా ఉంది.

sweety baagane konnade
ఆమె ప్రాపర్టీ అమ్మేస్తే షాక్ ఏంది రా నువ్వు నీ జర్నలిజం..హైదరాబాద్ లో అమ్మితే అమరావతి లో కొంటుంది ..!