చాన్నాళ్ల తర్వాత మళ్లీ ‘కింగ్’ సరసన ఛాన్స్

షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కరీనా కపూర్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కరీనా కపూర్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా ఓ క్రేజీ అప్ డేట్ రిలీజ్ చేసింది. ‘కింగ్’ సినిమాకు సంబంధించి షారుఖ్ తో దిగిన ఓ షాడో ఫొటోను షేర్ చేసింది.

డిసెంబర్ 24న ఏదో అద్భుతం జరగబోతుందని ఆమె హింట్ ఇచ్చింది. ఈ పోస్ట్ ద్వారా, తామిద్దరం కలిసి ఓ కింగ్‌లో ఓ స్పెషల్ సాంగ్ చేశామనే విషయాన్ని బయటపెట్టింది కరీనా.

ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన దీపిక పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. షారూక్ కూతురు సుహానా ఖాన్ తో పాటు అభిషేక్ బచ్చన్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు కరీనా రాకతో ప్రాజెక్టుకు మరింత క్రేజ్ పెరిగింది.

గతంలో వీరిద్దరూ ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘అశోక’, ‘రా.వన్’ వంటి చిత్రాలతో పాటు ‘డాన్’ చిత్రంలోనూ కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు, చాలా కాలం తర్వాత తెరపైకి వస్తున్నారు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్ పై షారూక్ నిర్మిస్తున్నాడు.

1994లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా ‘లియోన్: ది ప్రొఫెషనల్’ స్ఫూర్తితో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. తాజాగా రిలీజైన సాంగ్‌ సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.

2 Replies to “చాన్నాళ్ల తర్వాత మళ్లీ ‘కింగ్’ సరసన ఛాన్స్”

  1. మన వాళ్ళు అందరూ ఇరగొట్టేశారు గా ఎప్పుడో… అర్జున్ ఐతే తమిళ్ లో ఫ్రీమేక్ చేసి హలో ఫ్రెండ్ అని తెలుగులో డబ్బింగ్ కూడా చేసి వదిలారు గా మన మీద

Comments are closed.